ETV Bharat / city

'మత్తు'ను వదిలించడమే లక్ష్యంగా.. అందుబాటులోకి రెండు ప్రత్యేక విభాగాలు

NARCOTIC CONTROL CELL : రోజురోజుకి పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు నడుంకట్టారు. సరఫరా, విక్రయాలను మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న మాఫియాను కూకటివేళ్లతో సహా పెకలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ పర్యవేక్షణలో నేరుగా పనిచేయనున్న రెండు విభాగాలను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల ముఠాలపై నిఘా పెట్టి అరెస్టులు చేయడంతో పాటు... నిందితులకు కఠిన శిక్షలు పడేలా రెండు విభాగాలు పని చేయనున్నాయి.

NARCOTIC CONTROL CELL
NARCOTIC CONTROL CELL
author img

By

Published : Feb 10, 2022, 2:06 PM IST

Updated : Feb 10, 2022, 2:14 PM IST

NARCOTIC CONTROL CELL : మావోయిస్టులను ఏరివేతకు రూపొందించిన గ్రేహౌండ్స్ దేశ వ్యాప్తంగా పేరొందింది. సుశిక్షుతులైన కానిస్టేబుళ్లు, ఎస్సైలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అడవుల్లో వాళ్లతో ఉన్నతాధికారులతో కలిసి కూంబింగ్ చేయిస్తున్నారు. ఛత్తీస్​గఢ్​, ఒడిశా, మహారాష్ట్ర నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకోవడంలో సఫలమవుతున్నారు. గ్రేహౌండ్స్ పనితీరు గురించి తెలుసుకొని ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు సైతం అదే తరహాలో ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేశారు. టెర్రరిస్టులను అడ్డుకోవడానికి ఇంటిలిజెన్స్ విభాగంలో స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరోతో పాటు... కౌంటర్ ఇంటిలిజెన్స్, అక్టోపస్​ను ఏర్పాటు చేశారు. తీవ్రవాదుల కార్యకలాపాలను ముందస్తుగా గుర్తించడంలో ఇవి ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కౌంటర్ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో సెంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు ఇతర రాష్ట్రాల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు.

ఇక వ్యవస్థీకృత నేరాల్లో మాదక ద్రవ్యాలది మొదటి స్థానం. శాంతిభద్రతల సమస్యకు పెను ప్రమాదంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు డ్రగ్స్ బారిన పడ్డాయి. హైదరాబాద్​లోనూ మాదక ద్రవ్యాల వినియోగం క్రమంగా పెరుగుతున్నట్లు ఇంటిలిజెన్స్ నివేదికలు సైతం తేల్చాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు చేరుతుండటాన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. దీంతో మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు పోలీసు, ఎక్సైజ్ ఉన్నాతాధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ పోలీసులు తదనుగుణంగా రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. నార్కోటిక్ ఎన్​ఫోర్స్​మెంట్​వింగ్, నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపరివిజన్​వింగ్​లు మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాను అడ్డుకోవడానికి పనిచేయనున్నాయి.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఆర్గనైజేషనల్​ ఫ్రేమ్​ వర్క్​ను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.​ దాదాపు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియామకానికి అనుమతి ఇవ్వడమే కాకుండా.. అందుకు కావాల్సిన సాంకేతికతను సమకూర్చుకోవడం, ఇతర వ్యవస్థలను నిర్మించాలని ఆదేశించారు. వాటి ఆధారంగా గత పదిరోజులుగా పలువురితో చర్చలు జరుపుతున్నాం. వాటన్నింటిక సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రభుత్వం ముందు ఉంచుతాం. -మహేందర్​ రెడ్డి, డీజీపీ

నార్కోటిక్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగానికి డీసీపీ నేతృత్వం వహించనున్నారు. దక్షిణ మండల టాస్క్​ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 20మంది కానిస్టేబుళ్లు పని చేయనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చినా నార్కోటిక్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, సంబంధిత పోలీసులకు అప్పజెప్తారు. సంబంధిత పోలీస్​స్టేషన్​లో నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు.

అయితే ఎన్డీపీఎస్ కింద నేరాన్ని రుజువు చేయడం సవాల్​గా మారింది. పోలీసులకు ఈ చట్టంపై సరైన అవగాహన లేకపోవడం, సాక్ష్యాధారాలు కోర్టులో సమర్పించలేకపోతుండటంతో... నిందితులకు జైలు శిక్ష పడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు మరో విభాగాన్ని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. నార్కోటిక్ ఇన్వేస్టిగేషన్ సూపరివిజన్ విభాగాన్ని ఈ కేసులను పర్యవేక్షించనుంది. ఒక ఏసీపీ, ఒక సీఐ, ఒక ఎస్సై, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు ఎన్డీపీఎస్ కేసులను పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. సంబంధిత పోలీస్ స్టేషన్లలోని ఎస్సైలకు సలహాలు, సూచనలు అందించనున్నారు. కేసులో నేరం రుజువు చేయడానికి సేకరించాల్సిన ఆధారాలు, సాక్ష్యాల గురించి ఇన్వెస్టిగేషన్ సూపరివిజన్ విభాగం సలహాలనిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్​... వెయ్యి మందితో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనలపై.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిబ్బంది నియామకం, నిధులు సమకూర్చుకోవడం తదితర పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అనేది ఏర్పాటు చేస్తున్నాం. సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​కు ఇంఛార్జ్​గా ఉన్న చక్రవర్తిని ఈ విభాగానికి నాయకత్వం వహించాలని మేము నిర్ణయించాం. - సీవీ ఆనంద్​, హైదరాబాద్​ సీపీ

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వేయి మందితో కూడిన ప్రత్యేక విభాగం అందుబాటులోకి రానుంది. ఈ విభాగానికి సంబంధించి విధి విధానాల రూపకల్పనలో డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. త్వరలో తుది నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్ కు అందించనున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, ప్రజల సహకారంతో రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలను తరిమికొట్టడమే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చూడండి : TS Drugs Control Wings: పోలీస్​ శాఖలో డ్రగ్స్​ కంట్రోల్​ వింగ్స్​ ఏర్పాటు

Last Updated : Feb 10, 2022, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.