రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిమజ్జనోత్సవాలను వీక్షిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోపాటు రాష్ట్రంలో పలు చోట్ల గణేష్ నిమజ్జనాన్ని పరిశీలిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లల్లోని సీసీ కెమెరాలతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల సీసీ కెమెరాలను అనుసంధించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని 24 గంటలపాటు ఎస్పీ స్థాయి అధికారులు పర్యవేస్తున్నారు.
ఇదీ చదవండి: Balapur laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?