రాష్ట్రంలో ఇవాళ పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందనున్నారు. వారి స్థానంలో ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
పదవీ విరమణ పొందనున్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి స్థానంలో ఐజీ సంజయ్‌కుమార్‌కు అదనవు బాధ్యతలు అప్పగించారు. ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు బాధ్యతలను ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ చూడనున్నారు. వరంగల్ సీపీ రవీందర్ బాధ్యతలను సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌కు అప్పగించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు బాధ్యతలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ చూడనున్నారు. నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజ్ బాధ్యతలను ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌కు అప్పగించారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా