Rohit Sharma IPL : 2025 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించాలంటూ టీమ్ఇండియా మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయి మేనేజ్మెంట్ అతడ్ని మర్యాదపూర్వకంగానే ఈ విషయం గురించి అడగాలంటూ పేర్కొన్నారు.
"ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా రావాలని ముంబయి ఇండియన్స్ మర్యాదపూర్వకంగా అడగాలి. అంతేకానీ అతడ్ని హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఆడనివ్వకూడదు" అంటూ మంజ్రేకర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐపీఎల్‌లో జట్లు తమ పాత కెప్టెన్ల వైపు తిరిగి వెళ్లడం కొత్త విషయం కాదు. గతంలో, 2022లో, రవీంద్ర జడేజా CSK కెప్టెన్సీని MS ధోనీకి అప్పగించాడు, ఎందుకంటే జట్టు బాగా రాణించలేకపోయింది. ఐపీఎల్ 2025లో హార్దిక్ అదే పని చేస్తాడా అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఆ రూమర్స్‌కు చెక్
గత సీజన్‌లో జరిగిన పరిణామాల వల్ల రోహిత్ శర్మ మెగా వేలానికి వెళ్తాడన్న వార్తలు వెలువడాయి. అంతే కాకుండా దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ వంటి జట్లు రోహిత్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీగా ఉన్నాయని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ ఈ రిటెన్షన్‌తో ఆ రూమర్స్‌కు బ్రేక్ పడ్డట్లు అయ్యింది.
అయితే గత సీజన్‌లో రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యను ముంబయి జట్టుగా చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ముంబయి ఘోర విఫలాన్ని చవి చూసింది. 17 సీజన్లలోనే ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలోనూ ఆఖరి స్థానానికి పడిపోయింది. దీంతో ఈసారి కూడా అతడ్నే కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేకుంటే మళ్లీ రోహిత్‌కు పగ్గాలు అందిస్తారా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
ఇక ఈ సారి రోహిత్ శర్మను రూ.16.30కోట్లకు జట్టు రిటైన్ చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రాను రూ.18కోట్లకు, అలాగే సూర్య కుమార్‌ను రూ.16.35కోట్లు, హార్దిక్ పాండ్యను రూ.16.35 కోట్లు, తిలక్ వర్మను రూ.8కోట్లకు అట్టిపెట్టుకుంది. మొత్తంగా ఈ రిటెన్షన్ కోసం రూ.75కోట్లు వెచ్చించగా, మిగతా రూ.45కోట్లతో ముంబయి ఫ్రాంచైజీ మెగా వేలానికి వెళ్లనుంది.
రోహిత్ పేరిట మరో చెత్త రికార్డు - ధోనీ, సచిన్, దాదా సరసన హిట్‌మ్యాన్
రోహిత్, ధోనీ ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు? దూబే తెలివైన ఆన్సార్ - Dube Favourite Captain