ETV Bharat / city

Lock Down: ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా.. ఐతే ఈ పని చేయాల్సిందే! - ఏపీ వార్తలు

కరోనా వేళ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేసేందుకు నిర్ణయించుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​ తెలిపారు. ఆ రాష్ట్రం లోనే కాక.. ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఈ-పాస్​ తీసుకుని వెళ్లాలని సూచించారు.

lock down, ap lock down, corona cases
లాక్​డౌన్, ఏపీలో లాక్​డౌన్, కరోనా కేసులు
author img

By

Published : May 27, 2021, 2:49 PM IST

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ-పాస్​ నిబంధనలు తెలుసుకుని.. ప్రయాణాలు ప్లాన్​ చేసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్ ప్రజలకు సూచించారు. ఈ-పాస్ లేకుండా ప్రయాణించడం వల్ల రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్​పోస్టుల వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ-పాస్ నిబంధనలను వెల్లడించారు. అలాగే ప్రభుత్వం జీవోలో పేర్కొన్న మినహాయింపు, అత్యవసర సేవలు, సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోనే ప్రయాణించేవారికి:

ఏపీలో ఒక ప్రాంతం నుంచి మరో చోటుకి ప్రయాణించే వారు ఉదయం 6 నుంచి 12 గంటల లోపు గమ్యస్థానాలకు చేరేలా ప్రయాణికులు సిద్ధమవ్వాలి. సడలింపు సమయం దాటి ప్రయాణించాల్సి వస్తే సంబంధిత ధ్రువపత్రాలతో ఈ-పాస్​ పొందాలి.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి:

రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఆ సమయంలో రాష్ట్రంలోకి వచ్చే వారికి ఈ పాస్​ అవసరం లేదు. నిర్ధేశిత సమయంలో గమ్యాన్ని చేరుకోలేని వారు పాసులు తీసుకోవాలి.

ఈ-పాస్​ కొరకు:

కర్ఫ్యూ సమయంలో రాష్ట్రంలో ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా పాస్​ తీసుకోవాల్సి ఉంటుంది. సిటిజన్ సర్వీస్ పోర్టల్ http://appolice.gov.in, ట్విట్టర్ @APPOLICE100, ఫేస్ బుక్ @ ANDHRAPRADESHSTATEPOLICE లింకుల ద్వారా ఈపాస్ పొందవచ్చు.

తెలంగాణకు వెళ్లేవారికి:

కర్ఫ్యూ అమల్లో ఉన్నా.. లేకపోయినా.. తెలంగాణకు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా ఆ రాష్ట్ర ఈ-పాస్​ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది. https://policeportal.tspolice.gov.in/ లింక్​ ద్వారా పాస్​ తీసుకోవచ్చు.

తమిళనాడుకు ప్రయాణించే వారికి:

తమిళనాడులో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లేవారు https://eregister.tnega.org/ ద్వారా ఆ రాష్ట్ర పాస్​ తీసుకోవచ్చు.

ఒడిశా వెళ్లేవారికి:

ఒడిశాలో సంపూర్ణంగా లాక్​డౌన్​ అమలవుతోంది. https://covid19regd.odisha.gov.in/ అనే లింక్ ద్వారా ఈ-పాస్ పొంది, ఆ రాష్ట్రంలో ప్రయాణించవచ్చు.

కర్ణాటకలో ప్రయాణించాలంటే:

కర్ణాటకలో పూర్తి స్థాయిలో లాక్​డౌన్​ విధించారు. ఆ రాష్ట్రంలో ఈ-పాస్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ ద్వారా కర్ణాటక వెళ్లేందుకు పాసులు జారీ చేస్తున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం అవసరాన్ని బట్టే అనుమతిస్తోంది.

శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలని డీజీపీ తెలిపారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్​లో ప్రయాణించే రోగులు, వారి సహాయకులకు సాయం అందించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. అనుక్షణం ప్రజల వెన్నంటే ఉండి సేవలందిస్తామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప.. బయటకు రాకూడదని, స్వీయ రక్షణ పాటించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.