తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తజన సందడి పెరిగింది. జూన్ నుంచి పరిమిత సంఖ్యలో దర్శనాలను అనుమతిస్తున్నప్పటికీ.. గత 3 రోజుల నుంచి భక్తుల రాక అధికమైంది. నిన్న 22,500 మంది స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ నెల 16 నుంచి జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఉత్సవాలు జరపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
- ఇదీ చదవండి: కరోనాతో భారతీయ మసాలాలకు మంచి డిమాండ్