ETV Bharat / city

TDP PROTEST: తెదేపా నిరసనల హోరు.. దేవినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Oct 20, 2021, 11:06 AM IST

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో దాడులను నిరసిస్తూ.. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. కృష్ణాజిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. వైకాపా దౌర్జన్యం నశించాలని నినదించారు. అదే సమయంలో.. నిరసనల్లో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి సెంటర్​లో మాజీ మంత్రి దేవినేని అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల నేతలను నిర్బంధించారు.

devineni uma arrest
devineni uma arrest

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో దాడులను నిరసిస్తూ.. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. కృష్ణాజిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. వైకాపా దౌర్జన్యం నశించాలని నినదించారు. అదే సమయంలో.. నిరసనల్లో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి సెంటర్​లో మాజీ మంత్రి దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్నారు. తెదేపా నేత బుద్ధా వెంకన్నను గృహ నిర్బంధం చేశారు.

దేవినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: దేవినేని
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా నాయకులు దేవినేని ఉమా అన్నారు. జగన్ సర్కారు స్వేచ్ఛను హరిస్తోందన్న ఆయన.. పోలీసులు వైకాపా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా గుండాలు దాడి చేస్తే నిరసన చేపట్టడం తప్పా? అని ప్రశ్నించారు. అనంతరం.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై జరిగిన దాడిపై పటమట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పట్టాభి సతీమణితో కలిసి మాజీ మంత్రులు దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాడి వెనుక వారే..?
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిచేసిన వారిలో.. విజయవాడ వైకాపా నేతలున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్​కు చెందిన వివిధ కార్పొరేటర్లు స్వయంగా దాడులు పాల్పడ్జారని నేతలు ఆరోపిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిలో పలువురు రౌడీ షీటర్లు కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు. తెర వెనుక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న నేతలు.. ఇదే అంశంపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

అరెస్టుల పర్వం..
విజయవాడ నెహ్రూ బస్​స్టాండ్ ఆవరణలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్​తోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • కోడూరు ప్రధాన కూడలిలో మండల తెదేపా అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. నేతలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.
  • నాగాయలంకలో నిరసన తెలుపుతున్న తెదేపా నాయకురాలు తలశిల స్వర్ణలతను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గుడివాడ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ రావి వెంకటేశ్వరరావును అరెస్టు చేసిన పోలీసులు.. నందివాడ మండల పోలీస్ స్టేషన్​కు తరలించారు.
  • తెదేపా బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నూజివీడులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నూజివీడు సబ్ డివిజన్లో 26 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మరికొంత మందిని హౌస్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
  • నందిగామలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఇంటివద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు.

ఇదీ చూడండి: Tdp Leaders Arrest News: ఏపీలో తెదేపా నేతల గృహనిర్బంధాలు.. ముందస్తు అరెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.