దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థల నామినేటెడ్ పదవుల్ని ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 135 సంస్థలకు సంబంధించిన ఛైర్మన్లు, ఛైర్పర్సన్లను నియమించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన ఏ.మల్లికార్జున రెడ్డిని నియమించారు. ఆప్కాబ్ ఛైర్‌పర్సన్‌గా ఆ జిల్లాకే చెందిన ఎం.జాన్సీ రెడ్డికి పదవిని కట్టబెట్టారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కె.అజయ్ రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, ఏపీ మహిళా సహకార ఆర్ధిక కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్‌గా బి.హేమమాలినీ రెడ్డి, ఏపీ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నర్తు రామారావు, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దావులురీ దొరబాబు, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డిలను నియమించారు.
అన్ని సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు న్యాయం జరిగేలా...
మొత్తం మీద 135 కార్పొరేషన్లు, సంస్థల్లో 69 రాష్ట్రస్థాయి పదవులు, మిగిలిన వాటిని జిల్లా స్థాయిలో నియమించారు. మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్, మేకతోటి సుచరితలు జిల్లాల వారీగా ఛైర్మన్, ఛైర్పర్సన్ల పేర్లను ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు న్యాయం జరిగేలా జాగ్రత్త వహించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను ప్రకటన వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయని.. పార్టీలో నిరంతరం శ్రమించినవారికి దక్కాయని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. గతంలోలా నామినేటెడ్ పదవులు ఏవీ అలంకారప్రాయంగా మిగిలిపోవని స్పష్టం చేశారు.
ఇక ఏపీ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా ఎస్.శ్యామ్ ప్రసాద్ రెడ్డిని, ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని, ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్న కుమార్‌లను ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్, ఏపీ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ నెడ్ క్యాప్ ఛైర్మన్‌గా కె.కన్నప్పరాజు, ఏపీ స్టేట్ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీతంరాజు సుధాకర్, ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొల్లవరపు జాన్ వెస్లీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడామీ ఛైర్‌పర్సన్‌గా టి.ప్రభావతిని ప్రభుత్వం నియమించింది.
ఏపీఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాధ్, ఏపీ లేబర్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా డి.నవీన్ బాబు, ఏపీ క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు, ఏపీ కనీస వేతన సలహాబోర్డు ఛైర్‌పర్సన్‌గా బర్రి లీల, ఏపీ సాహిత్య అకాడమీ ఛైర్పర్సన్ పిల్లిమొగ్గల శ్రీలక్ష్మి, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కనుమూరు సుబ్బరాజు, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎం.అరుణ్ కుమార్, ఏపీ కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషగిరికి ఇచ్చారు. ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా షేక్ ఆసిఫ్, ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా బీఎస్ఎన్ పుణ్యశీల, ఏపీ కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌ను, నియమించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎ.వరప్రసాద్ రెడ్డి, ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా మందపాటి శేషగిరిరావును, ఏపీ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీహెచ్ సత్యనారాయణ రెడ్డిలకు పదవులిచ్చారు.
సోషల్ జస్టిస్ సలహాదారుగా జూపుడి ప్రభాకర్ రావును, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా పి.దేవసేన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మేరుగు మురళీధర్, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా సుస్మిత, సంగీత నృత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పి.శిరీష యాదవ్ ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చిరంజీవి రెడ్డి, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డిని నియమించారు.
కెేబినెట్‌లో రోజాకు ఛాన్స్!
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డిని నియమించటంతో ప్రస్తుత ఛైర్మన్ రోజాకు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. అటు తితిదే బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డినే ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది. సభ్యుల గురించిన కసరత్తు జరుగుతుండటంతో ప్రకటనను వాయిదా వేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కృష్ణలంక ప్రాంతపు కార్పొరేటర్ అడపా శేషుకు కాపు కార్పొరేషన్ పదవి దక్కింది. మరో కార్పొరేటర్ పుణ్యశీలకు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవి ఇచ్చారు. మొత్తంగా నామినేటెడ్ పదవుల్లో 76 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దక్కినట్టు ప్రభుత్వం తెలిపింది. ఓసీలకు 59 పదవులు ఇచ్చినట్టు పేర్కొంది. మొత్తంగా మహిళలకు 68 పదవులు ఇచ్చినట్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: Dk Aruna : కేంద్రం నిర్ణయంతో ఏపీ జల దోపిడీకి అడ్డుకట్ట