ETV Bharat / city

Pocso e-box : చిన్నారులపై లైంగిక వేధింపులా.. అయితే ఈ యాప్ ఉండాల్సిందే..! - Pocso e-box app

Pocso e-box : చిన్నారులపై లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. రోజురోజుకీ సమాజంలో పెరుగుతున్న ఆకతాయిల ఆకృత్యాలను అడ్డుకునేందుకు అవగాహన లోపమే ప్రధాన సమస్యగా మారింది. దీనిపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని పిల్లలకు అవగాహన కల్పించాల్సి ఉంది. వీటిపై ఫిర్యాదుల నమోదు కోసం పోక్సో చట్టం అమల్లో భాగంగా పోక్సో ఈ-బాక్స్‌ యాప్‌కు రూపకల్పన జరిగింది.

Pocso e-box app
పోక్సో చట్టం అమల్లో భాగంగా పోక్సో ఈ-బాక్స్‌ యాప్‌కు రూపకల్పన
author img

By

Published : Feb 3, 2022, 2:24 PM IST

Pocso e-box : ఏపీలోని విజయవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక తాను నివాసముండే అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి వేధింపులు భరించలేక బలవన్మరణం చెందింది. అకృత్యాల్ని రెండు నెలల పాటు పంటి బిగువన భరించింది. భౌతికంగా.. మాటలు.. చరవాణి సంక్షిప్త సందేశాల ద్వారా కూడా వేధింపులు ఆ చిన్నారికి ఎదురయ్యాయని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. ఐదు పేజీల లేఖలో తన మనోవేదనను బాలిక వెల్లడించింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆధునిక పరిజ్ఞానం ద్వారా అందివచ్చిన రక్షణ, భద్రత అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

త్తెనపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో నీలి చిత్రాలు చూపిస్తూ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఏమనుకుంటారోనని బాలికలు చాలా రోజులు చెప్పలేదు. బడికి వెళ్లమని ఏడుస్తూ మారాం చేస్తుండడమేగానీ తమకు ఎదురవుతున్న అసలు సమస్యను వారు చాలా రోజులు బయటపెట్టలేదు. ఒక బాలికలో వచ్చిన మార్పును గమనించి తల్లిదండ్రులు ప్రశ్నించగా అప్పుడు విషయమంతా బయటకొచ్చి పెద్దలు రోడ్డెక్కి ఉపాధ్యాయుడిపై చర్యలకు డిమాండ్‌ చేయాల్సి వచ్చింది.

లోకం పోకడ తెలియని పసిప్రాయం. తల్లిదండ్రులే కాదు తమతో చుట్టూ నివసించే వారిలో ఎవరు ముద్దు చేసినా పరవశించిపోతారు. తెలిసిన వారే అందులోనూ బాగా దగ్గర వారే చిన్నారుల్ని కాటేస్తున్నారు. చాలా మంది పిల్లలు తమకు ఎదురయ్యే వేధింపులు, అకృత్యాలను కుటుంబీకులకు తెలియజేయట్లేదు. చిన్నారులపై లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. గతంతో పోల్చితే కీచకుల భరతం పట్టే మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై చిన్నారులకు అవగాహన కల్పించి వారిని కంటికి రెప్పలా కాచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

వీరే స్ఫూర్తిమంతులు...

  • సత్తెనపల్లి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే బాలికకు వివాహం చేయాలని నిర్ణయించారు. ఆ బాలికకు పెళ్లి ఇష్టం లేదు. పైగా వయస్సు 14 ఏళ్లే. విషయాన్ని తోటి స్నేహితులకు చెప్పడంతో వారు ఏం చేయాలని ఆలోచించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. వారు పోలీసులతో కలిసి రంగంలోకి దిగి బాల్య వివాహాన్ని నిలుపుదల చేసి ఆ చిన్నారి చదువు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
  • క్రోసూరులోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యాలయంలో తరగతి గదిలో ఉపాధ్యాయుడి వేధింపుల్ని విద్యార్థులు మొదట్లోనే గుర్తించి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు వెంటనే విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఒప్పంద ఉపాధ్యాయుడిని ఉద్యోగంలో శాశ్వతంగా తొలగించారు.

తోడుగా యాప్‌

.

ఈ బాక్స్‌పై క్లిక్‌ చేసి కేంద్ర బృందానికి ఫిర్యాదు చేయొచ్చు

చిన్నారులపై వేధింపుల్ని అరికట్టేందుకు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సీపీసీఆర్‌) పోక్సో చట్టం అమల్లో భాగంగా పోక్సో ఈ-బాక్స్‌ యాప్‌కు రూపకల్పన చేసింది. ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల చిత్రాలు ప్రధాన పేజీలో కనిపిస్తాయి. వాటిలో ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో చిన్నారులు గుర్తించి దానిపై క్లిక్‌ చేసి వివరాలు సబ్‌మిట్‌ చేస్తే కేంద్ర బృందం నేరుగా రంగంలోకి దిగుతుంది. బాలికకు సంబంధించి సమాచారాన్ని బహిర్గతం చేయకుండా కామాంధులు, కీచకులపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

  • టోల్‌ఫ్రీ నంబరు 1098కి కాల్‌ చేసి తమకు ఎదురయ్యే వేధింపుల్ని చిన్నారులు తెలియజేసి సత్వర పరిష్కారం పొందవచ్చు.
  • 100 నంబరుకు కాల్‌ చేసి కూడా వేధింపులు, అకృత్యాల్ని తెలియజేయవచ్చు.

పిల్లల్లో వచ్చే మార్పులు గమనించాలి..

''పిల్లల్లో వచ్చే మార్పుల్ని పెద్దలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా బడికి వెళ్లనని మారాం చేస్తున్నా.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టత చూపిస్తున్నా.. ఆత్మన్యూనతాభావంతో ఉన్నా వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నారుల్ని లైంగిక వేధింపులకు గురి చేసే కీచకులు వారిని బెదిరిస్తుంటారు. ఫలానా వ్యక్తి తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పిన వెంటనే దాన్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలా చిన్నారికి వేధింపులు ఎదురవుతున్నాయో గుర్తించి కీచకులు జైలు ఊసలు లెక్కపెట్టేలా చేయాలి.'' -విరూపాక్షి దాక్షాయణి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.