ETV Bharat / city

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో భవనాలు, షెడ్లు కూల్చివేత - పండ్ల మార్కెట్‌

Gaddiannaram Fruit Market: గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది. తెల్లవారుజాము నుంచి పండ్ల మార్కెట్‌ ఆవరణలో పాత షెడ్లు, భవనాల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.

Demolition of buildings and sheds at Gaddiannaram Fruit Market

author img

By

Published : Mar 8, 2022, 12:25 PM IST

Gaddiannaram Fruit Market: హైదరాబాద్ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి పండ్ల మార్కెట్‌ ఆవరణలో పాత షెడ్లు, భవనాల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. వ్యాపారుల సామగ్రి, ఇతర వస్తువులు, కమీషన్ ఏజెంట్ల ట్రక్కులను ఆటోల్లో తరలిస్తున్నారు. మార్కెట్‌ ఖాళీ చేసేది లేదంటూ వ్యాపారులు నిన్న ఆందోళనకు దిగారు. ఏ క్షణాన్నైనా మార్కెట్‌కు తాళాలు వేస్తారోమోనని ఆందోళన చేయడంతో.. పోలీసులు శాంతింపజేశారు.

హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం మార్కెట్ ప్రాంగణం ద్వారాల తాళాలు తెరిచిన మార్కెటింగ్ శాఖ... రెండు రోజుల గడువు పూర్తి కావడంతో రోడ్లు భవనాలు శాఖ ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతలకు ఉపక్రమించారు. గతంలో పండ్ల మార్కెట్ స్థలాన్ని రోడ్డు భవనాల శాఖకు మార్కెటింగ్ శాఖ అప్పగించింది. సువిశాల ఆ ప్రాంగణంలో త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.

నగర శివారు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులోనే తాత్కాలికంగా పండ్ల మార్కెట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కోహెడలో శాశ్వత ప్రాతిపదిక మార్కెట్ పూర్తయ్యే వరకు బాటసింగారంలో పండ్ల క్రయ, విక్రయాలు సాగుతాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా కమీషన్ ఏజెంట్లు, హమాలీలు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.