ETV Bharat / city

కొవిడ్ ఎఫెక్ట్ : వ్యక్తిగత వాహనాలవైపే ప్రజల మొగ్గు!

కరోనా.. మనుషుల జీవనశైలిలో అనేక మార్పులు తీసుకువచ్చింది. మహమ్మారి వల్ల వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడంపై అనేక మందికి అవగాహన ఏర్పడింది. లాక్​డౌన్​ తర్వాత ప్రజారవాణా వ్యవస్థ రోడ్డెక్కినా.. ప్రజలు మాత్రం సొంత వాహనాల్లో వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. సరైన సమయానికి గమ్యాన్ని చేర్చడంతో సొంత వాహనాలు వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

demand-for-person-vehicles-is-increased-due-to-covid-crisis
వ్యక్తిగత వాహనాలవైపే ప్రజల మొగ్గు!
author img

By

Published : Dec 13, 2020, 12:08 PM IST

కరోనా ప్రభావం అందరి జీవితాలపై ప్రభావం చూపెడుతుంది. ప్రయాణానికి ప్రజా రావాణాపై ఆధారపడే వారంతా ఇప్పుడు సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. సొంత వాహనం ఉంటే.. ఎవరితో ఇబ్బంది లేకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు గమ్యానికి చేరుకోవచ్చని, కరోనా నుంచి కూడా కాస్త ఉపశమనం పొందవచ్చని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో భౌతిక దూరం పాటించడం కష్టసాధ్యం.. అదే సొంత వాహనమైతే..ఆ ఇబ్బందులు ఉండవని సొంత వాహనాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

సంవత్సరం నెలఅమ్ముడుపోయిన వాహనాల సంఖ్య
2019-20ఏప్రిల్ -సెప్టెంబర్3,76,596 (ద్విచక్రవాహనాలు)
2020-21ఏప్రిల్ -సెప్టెంబర్2,62,289 (ద్విచక్రవాహనాలు)
2019-20ఏప్రిల్ -సెప్టెంబర్ 62,099 (కార్లు)
2020-21ఏప్రిల్ -సెప్టెంబర్ 42,178 (కార్లు)
సంవత్సరంనెలమొత్తం అమ్ముడుపోయిన వాహనాల సంఖ్య
2019-20ఏప్రిల్ -సెప్టెంబర్ 4,99,731
2020-21ఏప్రిల్ -సెప్టెంబర్ 3,54,529

ఓ ద్వికచ్ర వాహన కంపెనీ సంస్థ ఏకంగా 14 లక్షల వాహనాలను విక్రయించినట్లు చెబుతోంది. గత పండగ సీజన్లతో పోల్చుకుంటే..ఇది చాలా ఎక్కువ అని ఆ సంస్థ సేల్స్ మేనేజర్ వెల్లడించారు.

పెరిగిన వాహన కొనుగోళ్లు

గడిచిన రెండు నెలల్లో వాహన కొనుగోళ్లు ఎక్కువగానే జరిగినట్లు రవాణాశాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ మాసంతో పోల్చితే.. నవంబర్​లో స్వల్పంగా తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటం వల్ల నెలాఖరుకు అమ్మకాలు ఊపందుకుంటాయని వాహన డీలర్లు పేర్కొంటున్నారు.

అక్టోబర్​లో రూ.276 కోట్ల ఆదాయం

అక్టోబర్ నెలలో 77,190 ద్విచక్ర వాహనాలు, 18,311 కార్లు అన్నీ కలిపి 95,501 వాహనాలు అమ్ముడుపోయాయి. ద్విచక్ర వాహనాలతో రూ.56.01 కోట్లు, కార్లతో రూ. 220.64 కోట్లు మొత్తం రూ.276 కోట్లకు పైగా రవాణా శాఖకు ట్యాక్స్ రూపంలో ఆదాయం వచ్చింది.

నవంబర్​లో రూ.229 కోట్ల ఆదాయం

నవంబర్​లో 76,076 ద్విచక్ర వాహనాలు, 13,837 కార్లు అమ్మకం జరిగాయి. మొత్తంగా 89,913 వాహనాలు అమ్ముడుపోయాయి. ద్విచక్ర వాహనాలతో రూ.54.89 కోట్లు, కార్లతో రూ.174.88 కోట్లు కలిపి మొత్తం రూ.229.77 కోట్లు ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.

అవే ఎక్కువ కొంటున్నారు

తక్కువ ధరలు ఉన్న ద్విచక్ర వాహనాలు, కార్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు వాహన డీలర్లు తెలిపారు. తక్కువ ధరలో సొంతంగా వాహనం నడుపుకుంటూ వెళ్లవచ్చనే అభిప్రాయంతోనే ఈ రకాల వాహనాలు కొనుగోలు చేస్తున్నారని డీలర్లు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.