హైదరాబాద్లో చెరువుల సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. శేరిలింగంపల్లిలోని పలు చెరువులను పర్యటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ, ఇరిగేషన్శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను చేపట్టారు. రెండు సంవత్సరాలుగా పనులు ప్రారంభించిన గుత్తేదారులు జాప్యం చేయడం వల్ల చెరువులో మురుగు నీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే వాటిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- ఇవీ చూడండి : కరీంనగర్ జిల్లా... ఇకపై 'ఐటీ హబ్'