కరీంనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐటీ టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఐటీ సంస్థల ప్రతినిధులను కోరారు. ఐటీ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి మంత్రి సమావేశమయ్యారు. కంపెనీల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
38 కోట్ల రూపాయల వ్యయంతో టవర్ నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలి అనుకున్నామని, మున్సిపల్ ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడిందని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు విధివిధానాలు, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐటీ టవర్‌తో కరీంనగర్ యువతకు ఇంటి వద్దే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని వినోద్‌కుమార్ అన్నారు. భవిష్యత్తులో నైపుణ్యం, శిక్షణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: 'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో జియో అదిరే ఆఫర్