ETV Bharat / city

బాండ్ల విక్రయం ద్వారా రుణమొత్తాన్ని రూ.500 కోట్లకు తగ్గించిన ప్రభుత్వం

Bonds sale: రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా రుణాలను సేకరించాలనుకుంది. అందుకు మొదట వెయ్యి కోట్లును సమాకూర్చాలనుకోంది. కానీ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకోని 500కోట్లుకు తగ్గించింది. ఈ నెల 20వ తేదీన ఆర్బీఐ బాండ్లను వేలం వేయనుంది.

state government bonds sale
రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం
author img

By

Published : Sep 17, 2022, 8:29 AM IST

Bonds sale: బాండ్ల విక్రయం ద్వారా ఈ వారం తీసుకోవాలనుకున్న రుణమొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు నుంచి 500 కోట్లకు తగ్గించింది. వెయ్యి కోట్లు సమకూర్చుకోవాలని మొదట ప్రభుత్వం భావించింది. 18, 19ఏళ్ల కాలానికి 500కోట్ల చొప్పున రిజర్వ్​బ్యాంకు ద్వారా బాండ్ల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆర్థిక శాఖ ప్రకటనలు జారీ చేసింది.

అయితే తరవాత నిర్ణయం మార్చుకున్న ప్రభుత్వం 500కోట్ల విలువైన బాండ్లు మాత్రమే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వారా 18ఏళ్ల కాలానికి బాండ్లు జారీచేసింది. ఈనెల 20న ఆర్బీఐ బాండ్లను వేలం వేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిధికి లోబడి బాండ్ల విక్రయం ద్వారా 19వేల 5వందల కోట్లు సమీకరించింది. తాజాగా మరో 500 కోట్ల విలువైన బాండ్లను జారీ చేసింది. దీంతో ఈ రుణాల మొత్తం 20వేల కోట్లకు చేరనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.