ETV Bharat / city

కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్.. త్వరలోనే పంపిణీ - భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల

130 కోట్ల మంది జనాభా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పనిపట్టే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. కరోనాను ఎదుర్కోవడానికి భారత్ సంధించిన బాణం కొవాగ్జిన్​కు భారత్ ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది.

DCGI green signal to Covaxin vaccine by bharat biotech
కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్
author img

By

Published : Jan 3, 2021, 1:14 PM IST

కొవిడ్ మహమ్మారి నుంచి కాపాడే దివ్యౌషధంగా భావిస్తున్న వ్యాక్సిన్​కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది. డిసెంబర్​లోనే భారత్ బయోటెక్ సహా.. సీరం సర్వే ఆఫ్ ఇండియా, ఫైజర్ టీకాలు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోగా.. సమగ్ర సమాచారం కావాలని కోరుతూ డీసీజీఐ అప్పట్లో టీకా అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆయా సంస్థలు అందజేసిన అనదపు సమాచారాన్ని డిసెంబర్ 30న పరిశీలించిన ఎస్​ఈసీ నేడు భారత్ బయోటెక్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది.

అక్కడ కూడా కొవాగ్జిన్ ట్రయల్స్

నేటి నుంచి దేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్​ టీకా అందుబాటులోకి రానుంది.రెండు దశల క్లినికల్ ట్రయల్స్​లో అత్యుత్తమ ఫలితాలను ఇచ్చిన కొవాగ్జిన్ టీకా.. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్​లో ఉంది. సుమారు 20వేల మందిపై ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్​లలోనూ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడం విశేషం.

ఉత్తమ ఫలితాలు

తొలుత 20 రీసస్ కోతులపై 14రోజుల వ్యవధిలో రెండు డోజులు ఇచ్చి ప్రయోగం చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో ఐజీజీ యాంటీబాడీల పెరుగుదలతో పాటు.. గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను నియంత్రించినట్లు గుర్తించారు. ఆ దశలో కొవాగ్జిన్ దాదాపు 65 శాతం సామర్థ్యాన్ని చూపినట్లు నిపుణులు స్పష్టం చేశారు. గతేడాది జులైలో దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో 375 మంది వాలంటీర్లతో తొలిదశ మానవులపై టీకా ప్రయోగాలను చేపట్టారు. సెప్టెంబర్​లో 750 మందిపై రెండో దశ ప్రయోగాలు చేయగా రెండు దశల్లోనూ టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు లేకపోగా.. వైరస్ నుంచి రక్షణ కల్పించటంలో ఉత్తమ ఫలితాలను ఇచ్చినట్లు గుర్తించారు.

కరోనా నుంచి రక్షణ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 25 కేంద్రాల్లో .. సుమారు 20వేల మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాలంటీర్లకు మొత్తం 28 రోజుల్లో 6 మైక్రో గ్రాముల ఇంజక్షన్​లు రెండు సార్లు లేక ప్లాసిబో రెండు డోస్​లను ఇస్తున్నట్లు సంస్థ గతంలోనే ప్రకటించింది. దేశంలో అత్యధిక మందిపై జరుగుతున్న మొట్టమొదటి ఫేజ్​ 3 వ్యాక్సిన్ ట్రయల్స్ ఇవే కావడం విశేషం. వైరస్ నుంచి సురక్షితం అయ్యేందుకు రెండు డోసులను నిర్ణీత కాల వ్యవధిలో తీసుకోవటం తప్పని సరి కాగా.. కొత్తరకం వైరస్​ పైనా ఇది ప్రభావం చూపుతుందని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా ఇప్పటికే ప్రకటించారు. ఐసీఎంఆర్, వైరాలజీ ల్యాబ్​లతో కలిసి అనతి కాలంలోనే కొవాగ్జిన్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారత్ బయోటెక్. కొవాగ్జిన్​లో అల్ హైడ్రాక్సిక్విమ్- 2 అనే కారకం ఉండటం వల్ల మెరుగైన వ్యాధినిరోధక శక్తినివ్వటంతోపాటు ఎక్కువ కాలం హానికారక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది.

ప్రపంచ దేశాల్లో కొవాగ్జిన్

కరోనా వైరస్​కు సంబంధించి ముక్కులో వేసుకునే చుక్కల మందు తయారీ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. చింపాంజీ అడినోవైరస్ ఆధారంగా ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ 19 వ్యాక్సిన్​ డ్రాప్స్​ను తయారు చేస్తోంది. ఇక ఈ ఒప్పందంతో అమెరికా, జపాన్, ఐరోపా మినహా ప్రపంచ దేశాల్లో ఈ టీకా పంపిణీకి భారత్ బయోటెక్ హక్కుల్ని సొంతం చేసుకుంది.

యాంటీబాడీలతో ప్రభావం తగ్గుతుంది

మహమ్మారికి సంబంధించి హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీ బాడీ థెరప్యూటిక్ రెజిమెన్ తయారీపైనా భారత్ బయోటెక్ కృషి చేస్తోంది. ఇందుకోసం న్యూ మిలినియమ్ టెక్నలజీ లీడర్ షిప్ ఇనీషియేటివ్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రీ డోమిక్స్ టెక్నాలజీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ రకం యాంటీ బాడీలు శరీరంలో వైరస్ వ్యాప్తిని వేగంగా అడ్డుకోవటంతోపాటు... వైరస్ సోకిన వారికి యాంటీబాడీలను ఇవ్వటం ద్వారా వారిపై మహమ్మారి ప్రభావాన్ని వేగవంతంగా తగ్గించవచ్చని భారత్ బయోటెక్ పేర్కొంది.

10కోట్ల డోసులు సిద్ధం చేసిన భారత్ బయోటెక్

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పది కోట్ల డోసులను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. రెండు దశల మానవ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలు ఇవ్వటంతోపాటు.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్​లో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం డీసీజీఐ భారత్ బయోటెక్​కు అత్యవసర వినియోగ అనుమతులను జారీ చేసింది.

ఇదీ చూడండి : 'ప్రపంచానికి టీకా అందించే సత్తా భారత్​కే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.