ETV Bharat / city

Amaravathi Case : ఏపీ రాజధాని వ్యాజ్యాలపై విచారణ.. సీజే కీలక వ్యాఖ్యలు - ఏపీ వార్తలు 2021

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రాంతాల మధ్య విభేదం తెచ్చే ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చేలా పాలనా వికేంద్రీకరణ చట్టంలో ఉందని.. అలా పొందుపరచవచ్చా అని ప్రశ్నించారు. అనంతరం రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ నేటికి వాయిదా వేశారు.

AP high court
AP high court
author img

By

Published : Nov 18, 2021, 10:13 AM IST

ఏపీ రాజధాని వ్యాజ్యాలపై విచారణ

ఏపీ రాజధాని వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. సందేహాలు వ్యక్తం చేశారు.

‘అసలు న్యాయ రాజధాని అంటే ఏమిటి? పాలన వికేంద్రీకరణ చట్టంలో కర్నూలులోనే ఆ రాష్ట్ర హైకోర్టు ఉండాలనే స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలను (హెచ్‌ఆర్‌సీ) ఇప్పటికే ఏర్పాటు చేసింది. హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారు. కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ పోదు. అలాంటప్పుడు హైకోర్టు లేకుండా కర్నూల్లో న్యాయ రాజధాని ఎలా సాధ్యం? రాజు (హైకోర్టు) లేకుండా రాజధాని ఎలా సాధ్యం? కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పాలన వికేంద్రీకరణ చట్టంలో ఉంది. అలాంటి హామీని చట్టంలో పొందుపరచవచ్చా? ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం ఉంది. అమరావతి ఏర్పాటు విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం.. హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ వర్తిస్తుందా?’ అని సీజే ప్రశ్నించారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌, రైతులు ఇడుపులపాటి రాంబాబు తదితరుల తరఫున న్యాయవాది పీబీ సురేశ్‌ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కర్నూలులో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేశారన్నారు. అమరావతి విషయంలో ఓసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చడానికి వీల్లేదన్నారు. అదే తరహాలో ఏపీ విభజన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్రం ఓసారి నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ఓసారి జరిగిపోయిన నిర్ణయం హైకోర్టుకు వర్తిస్తుందన్నారు. రాజధాని అమరావతి నుంచి హైకోర్టును తరలించడానికి వీల్లేదన్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ విభాగాలన్నీ ఒకచోట ఉంటేనే రాజధాని అవుతుందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అమరావతిలో ‘న్యాయ నగరం’ ఇప్పటికే ఏర్పాటు అయ్యిందన్నారు. ఏపీ విభజన చట్టానికి సవరణ చేస్తేనే హైకోర్టు తరలింపు సాధ్యమన్నారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ మూడోరోజు(3rd day) కీలక వాదనలు వినిపించారు.

సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేయండి: శ్యాం దివాన్‌ వాదన

‘రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టు ఆషామాషీది కాదు. జాతీయస్థాయిలో ప్రభావితం చేసే అనేక అంశాలు దాంతో ముడిపడి ఉన్నాయి’ అని రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రతిష్ఠ మాత్రమే కాకుండా జాతీయ ప్రతిష్ఠ ముడిపడి ఉందన్నారు. అమరావతి ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్‌ (బృహత్తర ప్రణాళిక)ను అమలు చేయాల్సిన విధి రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అమలు చేయకపోవడం అంటే అమరావతి అత్మను చంపేయడమే అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూముల్ని త్యాగం చేసిన రైతులకు ఇలాంటి పరిస్థితి ఏర్పడటాన్ని జాతీయస్థాయిని దృష్టిలో పెట్టుకొని చూడాలన్నారు. భూములిచ్చిన రైతులకు ఇచ్చిన చట్టబద్ధమైన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనుకడుగు వేస్తే భూసమీకరణ పథకం దేశవ్యాప్తంగా చెడ్డపేరు మూటగట్టుకునే ప్రమాదం ఉందన్నారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చి అమరావతిలో అభివృద్ధి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసిందన్నారు. మూడు రాజధానులు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని ప్రభుత్వం వాదనలు లేవనెత్తే అవకాశం ఉందని.. విధానపరమైన నిర్ణయం ఏకపక్షం, భూములిచ్చిన రైతుల ప్రాథమిక, చట్టబద్ధ హక్కులను హరించేలా ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని అన్నారు. అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ వికేంద్రీకరించాలని అప్పటి ప్రభుత్వం 2014 సెప్టెంబరులోనే శాసనసభ ద్వారా తీర్మానం చేసిందన్నారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో మూడు మెగా సిటీలు, 14 స్మార్ట్‌సిటీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా పాలన వికేంద్రీకరణ చట్టం చేయాల్సిన అవసరమే లేదన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి అవరోధంగా మారిన సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దుచేయాలని కోరారు. ఇంకేం వాదించారంటే.

‘ది’ అంటే ఒక రాజధానిగా భావించాలి

ఏపీ విభజన చట్టంలో ఆంగ్ల పదం ‘ది క్యాపిటల్‌’ అని స్పష్టంగా పేర్కొన్నారు. నిర్దిష్టమైన రాజధాని అని దాని అర్థం. ఏపీ రాజధాని కొత్తగా పురుడు పోసుకుంటున్నది కాబట్టి ‘ఒక రాజధాని’ అని భావించాలి తప్ప బహుళ రాజధానులు అని అర్థం చేసుకోవడానికి వీల్లేదు.

ప్రభుత్వాలు మారినా.. విధాన నిర్ణయాలు కొనసాగించాల్సిందే

ప్రభుత్వాలు మారినంత మాత్రాన పూర్వ ప్రభుత్వ నిర్ణయాలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జాతి ప్రయోజనం ముఖ్యమని పేర్కొంది. పూర్వ ప్రభుత్వ విధాన నిర్ణయాలను కొనసాగించాల్సిన బాధ్యత.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలపై ఉందని తేల్చిచెప్పింది.

ముందుకు వెళ్లాల్సిందే.. తప్పదు

అమరావతి రాజధానిగా ప్రధాన నిర్ణయం జరిగింది. సమీకరణలో భూములిచ్చిన రైతులకు హక్కులు సంక్రమించాయి. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ అమలు విషయంలో ముందుకెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.

భూసమీకరణ పథకానికి విలువ లేకుండా చేశారు

ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ 2014 సెప్టెంబరులో శాసనసభ తీర్మానం చేసింది. సీఆర్డీయే రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలతో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్‌ చేసినట్లయింది. ఆ రెండు చట్టాల కారణంగా అమరావతిలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన నిలిచిపోవడమే కాదు... భూసమీకరణ పథకానికి సమాజంలో విలువ లేకుండా పోయింది.

రైతులకిచ్చిన హామీల నుంచి తప్పించుకోలేరు

మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన 30వేల మంది రైతుల హక్కులు హరించినట్లయింది. అభివృద్ధి చేసిన అమరావతి ప్రాంతంలో రైతులకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చట్టబద్ధంగా హామీ ఇచ్చింది. ఆ హామీ నుంచి తప్పించుకోజాలదు.

అమరావతికి లెక్కించలేనంత నష్టం

సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలు భూములిచ్చిన రైతులను సాధారణ వర్గంలోకి నెట్టేస్తున్నాయి. అమరావతి ద్వారా పూర్వ ప్రభుత్వం సృష్టించిన మార్కెట్‌ విలువ, ప్రతిష్ఠను మరో ప్రభుత్వం ధ్వంసం చేయడానికి వీల్లేదు. భూముల్ని త్యాగం చేసినవారిని ప్రత్యేకవర్గంగా చూడాలి. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి నిర్మాణానికి లెక్కించలేనంత నష్టం జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మూడు రాజధానులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఆ కమిటీ నివేదిలకు చట్టబద్ధత లేదు’ అని శ్యాందివాన్‌ తన వాదనల్లో తెలిపారు.

దక్షిణ కొరియాలో రాజధాని తరలింపు నిర్ణయాన్ని తప్పుపడుతూ అక్కడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పును న్యాయవాది రమేశ్‌ హైకోర్టుకు సమర్పించారు. ఇతర న్యాయవాదుల వాదనల కోసం విచారణ గురువారానికి వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.