ETV Bharat / city

Cyclone Asani Effect: అనకాపల్లిపై అసని ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - అనకాపల్లిలో వర్షాలకు కుంగిపోయిన వంతెనలు వార్తలు

Cyclone Asani Effect: అసని తుపాను ప్రభావంతో ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో మాత్రం వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వంతెనలు కుంగిపోవటంతో రాకపోకలు నిలిచాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది.

Cyclone
Cyclone
author img

By

Published : May 12, 2022, 4:19 PM IST

అనకాపల్లిపై అసని ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

Cyclone Asani Effect: అసని తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏపీలోని అనకాపల్లి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వంతెనలు కుంగిపోవటంతో రాకపోకలు నిలిచాయి. వడ్డాది వద్ద ఉన్న ఈ వంతెన శిథిలావస్థలో ఉంది. కాగా.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఈ వంతెన ఓ వైపు కుంగిపోవటంతో అధికారులు మేల్కొని వంతెనపై రాకపోకలు నిషేధించారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి కృష్ఢబాబుతో ఫోన్​లో మాట్లాడారు. ప్రత్యామ్నాయ రహదారి తాత్కాలికంగా సత్వరమే నిర్మించేందుకు నిధులు ఇవ్వాలని కోరారు.

రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.10 మీటర్లకు పెరిగింది. జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి 491 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నీటిమట్టం 130.50 మీటర్లకు చేరితే గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తామని జలాశయం ఏఈ సుధాకర్ రెడ్డి ప్రకటించారు.

చీడికాడ మండలం కోనాం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి 180 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం ప్రస్తుతం 94.70 మీటర్లకు పెరిగింది. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నీటిమట్టం నిలకడగా ఉంది. జలాశయం పూర్తి నీటి మట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం 109.55 మీటర్లు ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.