ETV Bharat / city

ట్రాఫిక్‌ ఉల్లం‘ఘను’లకు సైబరాబాద్‌ పోలీసుల షాక్‌ - Cyberabad commissioner sajjanar

ఎలా పడితే అలా బండి నడిపి.. ట్రాఫిక్‌ చలానాలు చెల్లించి చేతులు దులిపేసు కుంటామంటే భాగ్యనగరంలో ఇక కుదరదు. మూడు నెలలు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాల్సిందే. అలా రెండోసారి దొరికితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Cyberabad police strict actions against traffic violations
ట్రాఫిక్‌ ఉల్లం‘ఘను’లకు సైబరాబాద్‌ పోలీసుల షాక్‌
author img

By

Published : Nov 6, 2020, 7:30 AM IST

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై తీవ్ర చర్యలకు సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ వైపు సామాజిక మాధ్యమాలు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు ఉల్లంఘనులకు చలానాలు విధిస్తున్నారు. హెల్మెట్‌ లేని వారికి ఈ పది నెలల్లో 18 లక్షల చలానాలు విధించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఇలా చేస్తున్నా ఫలితం లేకపోవడంతో.. గతేడాది కేంద్రం తెచ్చిన నూతన మోటార్‌ వాహనాల చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. నెల రోజులుగా ఈ చట్టంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలకు కారకులపై దృష్టి

రోడ్డు ప్రమాదాలకు నేరుగా కారణమయ్యే 8 నుంచి 10 రకాల ఉల్లంఘనలను సైబరాబాద్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి గుర్తించారు. ఈ ఉల్లంఘనలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఎంవీ చట్టం సెక్షన్‌ 206(4) ప్రకారం మొదటిసారి చిక్కితే 3 నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేస్తారు. రెండోసారి ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు చేయిస్తారు. అయినా బండి నడిపితే క్రిమినల్‌ కేసులు పెడతారు. వేరొకరి బండి నడుపుతూ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే బండిపై చలానా విధించడంతో పాటు యజమాని డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఆర్టీవో అధికారులకు సిఫార్సు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

చలానా కాదు.. శిరస్త్రాణం చూపిస్తేనే..

ఒకప్పుడు శిరస్త్రాణం లేకుండా బైకు నడిపితే సైబరాబాద్‌ పోలీసులు చలానా వేసి వదిలేసేవారు. ఇప్పుడలా కాదు.. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. తర్వాత హెల్మెట్‌ ఉందా.. లేదా? అని ఆరా తీస్తున్నారు. ఉంటే చూపించి వాహనాన్ని తీసుకెళ్లమంటున్నారు. లేదంటే అప్పటికప్పుడు కొనిపించి కౌన్సెలింగ్‌ చేసి మరీ అప్పగిస్తున్నారు. పెండింగ్‌ చలానాల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. సంచార మీ-సేవా కేంద్రాలను అందుబాటులో ఉంచి చలానాలను కట్టిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.