దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రతి కేసును సమర్థంగా ఎదుర్కొంటోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇలాంటి పటిష్ఠ వ్యవస్థపై పబ్లిక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
మంగళవారం ఉదయం శంషాబాద్ ఓఆర్ఆర్పై గోవులు తరలిస్తున్న లారీని అడ్డుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ పోలీసులపై ఆరోపణలు చేశారు. గోవధను అడ్డుకోవాల్సిన పోలీసులు.. భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు. డబ్బులు తీసుకుని గోవధకు సహకరిస్తున్నారని నిరాధార వ్యాఖ్యలు చేశారు.
రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్.. గౌరవప్రదమైన హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైమ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ పోలీసులపై అనవసరపు కమెంట్లు చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : గోవులను కబేళాలకు తరలిస్తుండగా పట్టుకున్న రాజాసింగ్