'మీరు ఇచ్చే ప్లాస్మాతో మరి కొన్ని ప్రాణాలు నిలబడతాయి' - corona treatment
ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మా దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. ఇప్పటికే 250 మందికి పైగా ప్లాస్మా దానం చేసారని... మరో వెయ్యి మంది ఇచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. తాము ఇచ్చే ప్లాస్మాతో మరి కొన్ని ప్రాణాలు నిలబడతాయని వివరించారు. తమ సిబ్బంది కొవిడ్ నియంత్రణలో నిర్విరామంగా శ్రమిస్తున్నారని... ఇదే క్రమంలో కొందరు వైరస్ బారినపడి కొలుకున్నారన్నారు. వారందరూ ప్లాస్మా దానం చేశారని పేర్కొన్నారు. తాము తలపెట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందంటున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
cyberabad cp sajjanar interview on plasma donation