సైబరాబాద్ శాంతిభద్రతల విభాగం పోలీసులకు తొలిసారిగా... బాడీ వోర్న్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. గొడవలు, ఆందోళనలు, ర్యాలీలు జరిగినప్పుడు.. అక్కడికి విధులకు వెళ్లిన పోలీసులు ఈ కెమెరాలు ఉపయోగిస్తారు. తద్వారా ఘటనాస్థలంలోని పరిస్థితులను కెమెరా దృశ్యాల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఈ కెమెరాలు వినియోగిస్తున్నారు.
తనిఖీలు, నిబంధనలు పాటించని వాహనదారులను ఆపి ప్రశ్నించే సమయంలో... కొందరు పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల విచారణలో... సిబ్బంది తమతో దురుసుగా వ్యవహరించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇకపై మిగతా సిబ్బంది బాడీ వోర్న్ కెమెరాలు ఉపయోగించనున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ వార్షిక బడ్జెట్లో నిరుద్యోగ భృతి అంశం..!