ETV Bharat / city

'మీరు ఫిర్యాదు ఇవ్వండి.. మిగతాది మేం చూసుకుంటాం' - Cyberabad cp sajjanar about online loan application case

ఆన్​లైన్ లోన్ యాప్​ల కేసులో కీలకపాత్ర పోషించిన చైనావాసి పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మొత్తం 11 యాప్​లు సృష్టించి రుణాలు ఇచ్చినట్లు తెలిపిన సీపీ.. యాప్​ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ సందేశాల్లో వచ్చే లింక్​లను ఓపెన్ చేయొద్దని చెప్పారు.

Cyberabad cp sajjanar about online loan application case
ఆన్​లైన్ లోన్ యాప్​లపై సీపీ సజ్జనార్
author img

By

Published : Dec 25, 2020, 1:03 PM IST

Updated : Dec 25, 2020, 1:48 PM IST

దా'రుణ' యాప్​ల కేసులో గురువారం రోజున నలుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కీలకపాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. స్థానికులతో కలిసి చైనా వాసి 2 డిజిటల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. మరో చైనా వాసి ఫిబ్రవరిలో వ్యాపార వీసాపై వచ్చి దందాలో పాల్గొన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారని తెలిపారు. మొత్తం 11 యాప్‌లు సృష్టించి రుణాలు ఇచ్చినట్లు గుర్తించామన్నారు.

తెలంగాణలో ఆన్​లైన్ లోన్ యాప్​ కేసులు

ప్రత్యేకంగా 40 ఏళ్ల లోపు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని రుణాలిచ్చారు. రుణాలపై 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేసేవారు. రుణాల చెల్లింపులు ఆలస్యమైతే జరిమానా వసూలు చేసేవారు. హైదరాబాద్‌ నుంచి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించేవారు. రుణయాప్‌లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారు. యాప్‌లకు ఎన్‌బీఎఫ్‌సీలతో సంబంధం లేదు. వ్యాపారానికి నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. చైనా, సింగపూర్, ఇతర దేశాల నుంచి నిధులు వచ్చాయా కోణంలో ఆరా తీస్తున్నాం.

సజ్జనార్, సైబరాబాద్ సీపీ

రుణాల యాప్‌లే కాకుండా ఆటల యాప్‌ల్లోనూ మోసాలు జరుగుతున్నాయని తెలిపిన సీపీ సజ్జనార్.. యాప్‌ల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్‌ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాప్‌ల ద్వారా మోసపోయిన వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని భరోసానిచ్చారు.

Last Updated : Dec 25, 2020, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.