ETV Bharat / city

ఫేస్​బుక్​లో మునిగిపోతున్నారా..! మీరు బుక్కైనట్టే..! - cyber crimes increasing in hyderabad in name of facebook

మీకు ఫేస్‌బుక్‌ ఖాతా ఉందా..? స్నేహితులు.. సన్నిహితులతో పాటు కొత్తవారితోనూ ఛాటింగ్‌ చేస్తుంటారా? రోజూ రెండు మూడు గంటలైనా ఫేస్‌బుక్‌లోనే ఉంటారా? అయితే ఇప్పటివరకు ఏమోగానీ ఇకపై జాగ్రత్తపడండి. ఎందుకంటే సైబర్​ నేరగాళ్లు మీ ఖాతాను వారికనుగుణంగా మార్చుకుని డబ్బులు దోచుకుంటున్నారు.

cyber-crimes-increasing-in-hyderabad-in-name-of-facebook
మీ ఫేస్‌బుక్‌.. సైబర్‌ నేరస్థుల చేతుల్లో..!
author img

By

Published : Jun 5, 2020, 11:52 AM IST

Updated : Jun 5, 2020, 12:00 PM IST

ఒకప్పటిలా ఇప్పడు మీ ఫేస్‌బుక్‌ ఖాతా మీ ఇష్టం కాదు...మీ వివరాలను సంకేత పదాలతో సైబర్‌ నేరస్థులు వారి ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే వేలమంది ఫేస్‌బుక్‌ ఖాతాలను తమకు అనుగుణంగా మార్చుకుని రూ. వేలల్లో నగదు బదిలీ చేసుకున్నారు. అసభ్యమైన చిత్రాలను సైతం పోస్ట్‌ చేసి వాటి ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేసి మరీ డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో సైబర్‌ నేరస్థులు రోజుకు 50 మంది నుంచి 100మంది ఫేస్‌బుక్‌ ఖాతాల పేర్లను స్వల్పంగా మార్చి అవసరమైనప్పుడు నేరాలకు పాల్పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు.

ప్రకటన కర్తలనూ..

ఫేస్‌బుక్‌ ఐడీలను సంపాదిస్తున్న సైబర్‌ నేరస్థులు ఫేస్‌బుక్‌ ఖాతాలో వ్యాపార ప్రకటనలు పెడుతున్న వారినీ వదలడం లేదు. మీ ఖాతాలు మాయం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. డబ్బులిస్తేనే ఖాతాను పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. బెంగళూరులోని ఫేస్‌బుక్‌ సైబర్‌క్రైమ్‌ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరు, వివరాలను తెలుసుకునే వీలుందని వివరిస్తున్నారు. ఇంకా నమ్మకం లేకపోతే... మీరు నాతో మాట్లాడ్డం ఆపేసిన వెంటనే మీ ఫేస్‌బుక్‌ ఖాతా మొత్తం మాయమవుతుందంటూ బెదిరిస్తున్నారు. దీంతో కొందరు భయపడి నేరస్థుడు సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా నెల వ్యవధిలో 15మంది బాధితులు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫేస్‌బుక్‌ ఖాతాను మాయం చేయడం సాంకేతికంగా సాధ్యం కాదంటూ పోలీసులు వారిని ఊరడించి పంపుతున్నారు.

సాయం చేయాలంటూ అభ్యర్థనలు

అధికారులు, ఆచార్యులు, ఉద్యోగులు, యువతులు, మహిళలు ఇలా వేర్వేరు వర్గాలకు చెందినవారి ఫేస్‌బుక్‌ ఖాతాల వివరాలను సైబర్‌ నేరస్థులు డార్క్‌నెట్‌, డీప్‌వెబ్‌ల ద్వారా గంపగుత్తగా కొనుగోలు చేస్తున్నారు. ఎంపిక చేసుకున్న వారి ఐడీ, పాస్‌వర్డ్‌లతో ఖాతాల్లోకి ప్రవేశిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నామని, షాపింగ్‌కు వెళితే పర్సు పోయింది.. హోటల్‌ బిల్లు కట్టాలంటూ ఫేస్‌బుక్‌ ద్వారా అభ్యర్థిస్తున్నారు. ఫలానా బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ చేయాలని, ఫోన్‌ కూడా లేదని పోస్టులు పెడుతున్నారు.

నిజమే అనుకుని వారి స్నేహితులు, బంధువులు ముందూ వెనుకా ఆలోచించకుండా సైబర్‌ నేరస్థులు సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారు. తమ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడంటూ పోస్టులు పెట్టడం వల్ల తాము రూ. 1.25లక్షలు పంపించామని ఒకరు, తాను రూ.90వేలు నగదు బదిలీ చేశానని మరొకరు.. ఇలా వారం రోజుల వ్యవధిలో 10మంది ఫిర్యాదు చేశారని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

Last Updated : Jun 5, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.