కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీలో మరోసారి కర్ఫ్యూను పొడిగించారు. కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.