ఏపీలో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. సాయంత్రం 6గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి.
తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ వేళలు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి. సాయంత్రం 5 గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం సాధారణ వేళల్లోనే పని చేస్తాయని... ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు వచ్చేలా పలు మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం.. మేనమామ, అత్తలే హంతకులా?