ETV Bharat / city

Cultivation of Crops in Telangana: ప్రతిపాదన ఒకటి.. సాగు ఇంకొకటి

రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరందించే కాళేశ్వరం (KALESHWARAM) ఎత్తిపోతల కింద వానాకాలంలో కొత్త ఆయకట్టు 18.25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే, యాసంగిలో 5.5 లక్షల ఎకరాల్లో పంట వేస్తారు. వానాకాలంలో 134.5 టీఎంసీల నీటిని సరఫరా చేస్తారు. ఇందులో 15.5 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకే ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. 2.75 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి (CROP) వేయాలి. రైతులు అంతకు మించి సాగుచేస్తే ప్రాజెక్టు లక్ష్యమే తలకిందులవుతుంది. నీళ్లొచ్చిన తర్వాత వరి వద్దంటే మానడం అంత సులభం కాదు. ఆరుతడి పంటల దిగుబడికి తగిన మార్కెట్‌ వసతి, మంచి ధర వచ్చేలా చూడగలిగితేనే ఈ వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది.

author img

By

Published : Oct 1, 2021, 6:44 AM IST

Cultivation of Crops in Telangana:
ప్రతిపాదన ఒకటి.. సాగు ఇంకొకటి

కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల, బీమా కింద కూడా ఆరుతడి పంటలే వేయాలి. నీటిపారుదల శాఖ(IRRIGATION DEPARTMENT OF TELANGANA)కు దీన్ని ఆచరణలోకి తేలేకపోయింది. దీంతో ఆయకట్టు రైతులు వరి పంటనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాదాపు అన్ని ప్రాజెక్టుల పరిధుల్లోనూ ఇదే పరిస్థితి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లో (DPR) పేర్కొన్న పంటలు (CROP) వేరు.. వాస్తవంలో రైతులు సాగు చేసేది వేరు. దీంతో వరి విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. పైపెచ్చు ఏ ప్రాజెక్టు కిందా లక్ష్యం మేరకు సాగునీటిని అందించడం సాధ్యం కావడం లేదు. దశాబ్దాలుగా ఇదే అనుభవం ఉన్నా, ఎక్కువ ప్రాజెక్టుల నిర్మాణం, అత్యధిక ఆయకట్టుకు నీరందించడం లక్ష్యం కావడంతో.. పంటల సాగులో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉందని వ్యవసాయ, సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాలమూరు(PALAMUR) కింద ఆరుతడి మాత్రమే

  • పాలమూరు-రంగారెడ్డి(PALAMUR-RANGAREDDY) ఎత్తిపోతల కింద పూర్తిగా ఆరుతడి పంటలే వేయాలి. ఈ ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని తీసుకున్నా తాగు, పారిశ్రామిక అవసరాలకు పోను సుమారు 75 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. వీటితో 12.3 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలి.
  • 6.8 లక్షల ఎకరాలకు నీరందించే సీతారామఎత్తిపోతల(SEETHARAMA LIFT IRRIGATION) కింద కూడా లక్షా 87 వేల ఎకరాల్లో మాత్రమే వరి వేయాలి. మిగిలింది మిరప తదితర పంటలు.అయితే ఈ ప్రాజెక్టు కింద కొంత అటు ఇటు మారినా సమస్య ఉండదు. పైగా మొదటి నుంచి వర్షపాతం తదితర కారణాల వల్ల ఈ ప్రాంతంలో వాణిజ్య పంటల వైపు రైతుల మొగ్గు ఎక్కువగా ఉంది.

డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వల పనులు పూర్తికాక

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి పొలాలకు నీరందాలంటే డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తి కావాలి. అనేక ప్రాజెక్టుల కింద ఈ పనులు పూర్తి కాకపోవడంతో నేరుగా చెరువులు నింపడం ప్రారంభించారు. దీంతో రైతులు వరిసాగుకు మొగ్గుచూపుతున్నారు. గతంలో వర్షంపై ఆధారపడటం వల్ల కొన్నిచోట్ల చెరువులు నిండకపోయేవి. మరికొన్ని చోట్ల చెరువులు ఆక్రమణలకు గురై పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో రైతులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రాజెక్టుల నుంచి మళ్లించే నీటితో చెరువులు నింపడం కలిసొచ్చింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఏ ఆయకట్టుకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారో అది జరగడం లేదు. భవిష్యత్తులో ఈ పనులు పూర్తయి చెరువులకు నీటిని ఇవ్వలేకపోతే అప్పుడు కొత్త సమస్య వస్తుందని, ఇప్పటి నుంచి ఈ రెండింటి మధ్య సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ(IRRIGATION DEPARTMENT OF TELANGANA) వర్గాలు పేర్కొంటున్నాయి. వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగితే ప్రభుత్వం(TELANGANA GOVERNMENT) కొనుగోలు చేయడం, మార్కెటింగ్‌ ఒక సమస్య అయితే, లక్ష్యం మేరకు సాగు విస్తీర్ణానికి నీటిని సరఫరా చేయడం కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

సాధ్యం కాదు...

ఒక టీఎంసీ నీటితో వరి సాగు చేస్తే ఆరేడువేల ఎకరాలకు మించి సరఫరా చేయడం సాధ్యం కాదు. ఆరుతడి పంటలకైతే పదివేల ఎకరాల వరకు ఇవ్వొచ్చు. సూక్ష్మసేద్యం అమలు చేస్తే 15 వేల ఎకరాలు సాగులోకి తేవొచ్చు. వానాకాలంలో ఆరుతడి పంటలు సాగు చేస్తే వర్షం లేనప్పుడు నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. రబీలో మాత్రం పంటకు పూర్తిగా అవసరమైన మేరకు ఇవ్వాలి. ఈ కారణంగానే ప్రతి ప్రాజెక్టు కింద రబీ ఆయకట్టు తక్కువగా ఉంటుంది.

....

ఇదీచూడండి: Election Notification 2021 : హుజూరాబాద్​, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.