ETV Bharat / city

ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే: సీఎస్​ - cs somesh kumar speaks on Electricity Bills

గ్రామ పంచాయతీలు, పురపాలికలు.. ప్రతినెలా విధిగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని సీఎస్​ సోమేశ్​కుమార్​ స్పష్టం చేశారు. కేసీఆర్​ ఆదేశాలతో డిస్కంలు, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సీఎస్​ సమావేశమయ్యారు. బకాయిల చెల్లింపులపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించాలని డిస్కంలను ఆదేశించారు.

cs somesh kumar review
ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే: సీఎస్​
author img

By

Published : Jul 31, 2020, 5:15 PM IST

గ్రామ పంచాయతీలు, పురపాలికలు.. ప్రతినెలా విధిగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ స్పష్టం చేశారు. లేని పక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో డిస్కంలు, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సీఎస్​ సమావేశమయ్యారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులపై సమీక్షించారు.

ప్రతినెలా విద్యుత్ బిల్లులు చెల్లించేలా చూడాలని అధికారులకు సీఎస్​ సోమేశ్​కుమార్​ సూచించారు. బకాయిలు చెల్లింపుల విషయమై త్వరలోనే సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. గ్రామ పంచాయతీలు, పురపాలికలతో చర్చించి బకాయిల చెల్లింపులపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించాలని డిస్కంలకు సూచించారు. పనిచేయని బోర్లు, ఇతర విద్యుత్​ బిల్లుల్లో వ్యత్యాసాలను సరిచేసేందుకు ఉమ్మడి బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్​ మీటర్ల రీడింగ్ ద్వారానే బిల్లులు వసూలు చేయాలన్న సోమేశ్ కుమార్... మీటర్లు లేని అన్ని చోట నెలరోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇవీచూడండి: గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో మొక్కలు నాటిన ద్రోణవల్లి హారిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.