రాష్ట్రంలో అక్కడక్కడ కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. పైర్లు చేతికొస్తున్న తరుణంలో అకాల వర్షాల ప్రభావంతో ప్రధాన ఆహార పంట వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయలు, పూల తోటలకు నష్టం వాటిల్లుతోంది. కల్లాల్లో కూడా పంట నీటిపాలైంది.
ప్రధానమంత్రి పంట బీమా పథకం కింద ప్రీమియం రుసుం చెల్లించిన రైతులు పంట దెబ్బతిన్నట్లైతే.. ఆ నష్ట సమాచారం 72 గంటల్లోపు జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్న బీమా కంపెనీలు, టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి.
సంప్రదించవల్సిన నెంబర్లు..
- అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ: 1800-599-2594
- ఇఫ్కో టోకియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ: 1800-103-5499
నివేదిక అందజేయాలి..
జిల్లాల వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు.. తమ తమ పరిధిలో ప్రధానమంత్రి పంట బీమా పథకం కింద నమోదైన పంటలు, నష్టపోయిన రైతుల జాబితాలను బీమా కంపెనీలకు గడువులోపు తెలియజేయాలని ఆదేశించారు. బీమా కంపెనీలు సర్వేయర్లను నియమించి వ్యవసాయ శాఖ, రైతుల సమక్షంలో పంటల నష్టంపై బేరీజు వేసి నివేదిక అందజేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సూచించారు.
ఇవీ చూడండి: నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తే ఏడేళ్లు జైలు!