ETV Bharat / city

కరోనా చికిత్సకు అధిక ఫీజు వసూలు చేసిన ఆస్పత్రిపై క్రిమినల్​ కేసు - అనిల్‌ న్యూరో ట్రామా సెంటర్ పై క్రిమిన్ల కేసు

ఏపీలో కొవిడ్‌ చికిత్సల కోసం నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా స్థానిక విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎస్‌.పి.కనకరాజు అన్నారు. ఈ మేరకు అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ పై గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.

కరోనా చికిత్సకు అధిక ఫీజు వసూలు చేసిన ఆస్పత్రిపై క్రిమినల్​ కేసు

author img

By

Published : May 11, 2021, 12:31 PM IST

కొవిడ్ చికిత్సకు అధిక ఫీజు వసూలు చేసిన అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్​పై ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. కొవిడ్‌ చికిత్సలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తే ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్థానిక విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎస్‌.పి.కనకరాజు హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వై.వెంకటరత్నం.. ఈ నెల 4న చుట్టుగుంటలోని అనిల్‌ న్యూరో సెంటరులో కొవిడ్‌ చికిత్స నిమిత్తం చేరారు. రూ.4లక్షలు అవుతాయనటంతో రూ.2లక్షలు అడ్వాన్స్‌ చెల్లించినట్లు వెంకటరత్నం సోదరుడు రవి తెలిపారు. తన సోదరుడికి నయం అయిందని చెప్పటంతో, సోమవారం ఉదయం మిగిలిన రూ.2 లక్షలు చెల్లించేందుకు వెళ్లాడు. ఆసుపత్రి యాజమాన్యం రూ.2.5 లక్షలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయటంతో.. అతడు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎస్‌.పి.కనకరాజు, విజిలెన్స్‌ సీఐ అశోక్‌రెడ్డి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఉషారాణి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలునాయక్‌లు ఆ ఆసుపత్రిలోని రికార్డులు తనిఖీ చేశారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్‌ రోగుల నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అనిల్‌ న్యూరో అండ్‌ ట్రామా సెంటరు యాజమాన్యంపై మాచవరం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు కనకరాజు వెల్లడించారు. ఆసుపత్రిలో 30 మంది రోగుల చికిత్సకు అనుమతి పొంది, బెడ్లు ఖాళీగా లేవని చెబుతున్నారని.. విచారణలో 9 మంది మాత్రమే రోగులు ఉన్నారని అధికారులు గుర్తించారు. గతంలో ఇదే ఆసుపత్రిపై జిల్లా జాయింట్‌ కలెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈవోలు రూ.2 లక్షలు అపరాధరుసుం విధించారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని.. తిరిగి రాదని..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.