ETV Bharat / city

సడలింపుల ఫలితం.. భాగ్యనగరంలో భారీగా పెరిగిన నేరాలు - hyderabad crime news

లాక్‌డౌన్ స‌మ‌యంలో భాగ్యన‌గ‌రంలో 60 శాతం నేరాలు త‌గ్గాయ‌ని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే స‌డ‌లింపుల‌ అనంతరం ఒక్కసారిగా నేరాలు పెరిగాయి. ఆర్థిక లావాదేవీలు అక్రమ సంబంధాలు, పాత క‌క్షల కార‌ణంగా అత్యంత పాశ‌వికంగా హ‌త్యల‌కు పాల్పడున్నారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు అప్రమ‌త్తమయ్యారు.

crime rate increased inn hyderabad after lock down relaxations
సడలింపుల ఫలితం.. భాగ్యనగరంలో భారీగా పెరిగిన నేరాలు
author img

By

Published : Jun 24, 2020, 4:49 AM IST

క‌రోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా న‌గ‌రంలో నేరాలు తగ్గాయి. అయితే కొన్ని స‌డ‌లింపుల కార‌ణంగా తిరిగి సాధార‌ణ పరిస్థితులు నెల‌కొన్నాయి. నేరాలూ అదే స్థాయిలో పెరిగాయి. ఏ మాత్రం భ‌యం లేకుండా న‌డి రోడ్డుపైనే కిరాతంగా హ‌త్యల‌కు పాల్పడుతున్నారు. ఆదిప‌త్య పోరులో భాగంగా గ్యాంగ్ వార్‌లు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల లంగ‌ర్‌హౌజ్ పోలీస్​ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన రౌడీషీట‌ర్ల జంట హ‌త్యలే నిద‌ర్శనం.

హ‌త్యల‌తో పాటు హ‌త్యాయ‌త్నాలు కూడా పెరిగాయి. చిన్న చిన్న త‌గాదాల‌కే క‌త్తులు దూస్తున్నారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ప‌శ్చిమ, ద‌క్షిణ మండ‌లాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. న‌గ‌రంలో ఈ నెల‌లో ఇప్పటి వ‌ర‌కు 10 హ‌త్యలు జరిగాయి. ఇప్ప‌టికే క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని రౌడీ షీట్ ఉన్న వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

మద్యం మత్తులో..

ఈనెల 1న ఎస్​ఆర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో భార్య‌పై అనుమా‌నంతో సంజీవ్ అనే వ్యక్తి క‌త్తితో దాడి చేసి హ‌త్యచేశాడు. ఈనెల 2న గాంధీన‌గ‌ర్ పోలీస్​ స్టేష‌న్ ప‌రిధిలో కృష్ణ అనే వ్య‌క్తిని మద్యం మత్తులో అత‌ని స్నేహితులే హతమాచ్చారు. అనంత‌రం రైల్వే ట్రాక్ ప‌క్క‌న ప‌డేసి కాల్చి వేశారు. ఈనెల 4న నలుగురు హ‌త్యకు గుర‌య్యారు. గోల్కొండ పోలీస్​ స్టేష‌న్ ప‌రిధిలో మ‌జ‌ర్ అనే వ్య‌క్తి.. మద్యం మత్తులో అత‌ని స్పేహితుడినే బండ రాయితో మోదీ హత్యచేశాడు.

వివాహేతర సంబంధం..

రేయిన్ బ‌జార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వివాహేతర సంబంధం కార‌ణంగా ఇమ్రాన్ అనే వ్య‌క్తిని కొంద‌రు వ్య‌క్త‌ులు న‌డి రోడ్డుపై వెంటాడి మ‌రి కత్తితో పొడిచి హతమార్చారు. అదేరోజు సాయంత్రం లంగ‌ర్‌హౌజ్ పోలీస్​ స్టేష‌న్ ప‌రిధిలో రౌడీ షీట‌ర్లు మ‌హ‌మ్మ‌ద్ చాందీ, ఫ‌యాజుద్దీన్​ల‌ను హత్యచేశారు. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న వారిని కారుతో ఢీకొట్టి మరి దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

పాతకక్షలు..

ఈ నెల 6న హిమాయ‌త్‌సాగర్ ప్రాంతంలో డ‌బ్బు కోసం స‌త్య‌నారాయ‌ణ అనే వ్య‌క్తిని బండ‌రాళ్ల‌తో కొట్టి చంపారు. పాత‌క‌క్ష‌లతో 7న నెహ్రూ జంతు ప్రదర్శనశాల సమీపంలో వ‌సీం అనే వ్య‌క్తిపై ఆసిస్‌, స‌ల్మాన్ అనే ఇద్ద‌రు.. క‌త్తుల‌తో దాడి చేసి క్రూరంగా హతమార్చారు. ఈనెల 14న దుండిగల్ పోలీస్​ స్టేష‌న్ ప‌రిధిలో అజాం అనే వ్య‌క్తి త‌న సొంత అన్న‌.. త‌న కంటే ఆర్థికంగా ఎదగడాన్ని ఓర్చుకోలేక నిద్రిస్తున్న సమయంలో దుప్ప‌టితో గొంతు బిగించి హ‌త్య చేశాడు.

కాంగ్రెస్​ నేత హత్య..

మేడ్చ‌ల్ జిల్లా దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జావెద్ అనే వ్యాపారిని స్థలం చూద్దాం రమ్మని పిలిచి గొడ్డలితో నరికి చంపారు. తాజాగా ఈనెల 19న ఘ‌ట్​కేసర్ ప‌రిధిలో వివాహేతర సంబంధం కార‌ణంగా సైదులు అనే వ్య‌క్తిని చంపి.. యాద‌గిరి అనే వ్యక్తి పోలీస్​ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. షాద్‌న‌గ‌ర్ ప‌రిధిలో భూవివాదంలో జ‌డ్చర్లకు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాంచంద్రారెడ్డి అపహరించి మరి కొత్తూరు సమీపంలో దారుణంగా హత్యచేశారు. దీనిపై పోలీసులు ధ‌ర్యాప్తు చేస్తున్నారు.

లాక్​డౌన్ విధుల తర్వాత.. సాధారణ విధుల్లోకి వచ్చేసరికి... వ‌రుస హ‌త్య‌లు, హ‌త్యాయ‌త్నాలు.. కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. నేరాల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

ఇవీచూడండి: రూ.30 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత... 23 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.