ETV Bharat / city

AP crime rate : ఏపీలో తెగ నేరాలు చేస్తున్నారట..

AP Crime Rate : నాలుగేళ్లతో పోలిస్తే 2020లో ఏపీలో క్రైమ్ రేటు భారీగా పెరిగింది. దేశంలో పెరుగుతున్న నేరాలపై కేరళ ఎంపీ జోస్‌ కె.మణి బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ సమాధానం ఇచ్చారు. ఏపీలో 2019లో 1,45,751 కేసులు నమోదుకాగా క్రైమ్‌ రేటు 278.6గా ఉందని, 2020లో కేసుల సంఖ్య 2,38,105కి, క్రైమ్‌ రేటు 452.7కి చేరిందని మంత్రి వెల్లడించారు.

AP crime rate
AP crime rate
author img

By

Published : Mar 31, 2022, 7:09 AM IST

AP Crime Rate : ఏపీలో 2020లో క్రైమ్‌ రేటు భారీగా పెరిగింది. అంతకుముందు నాలుగేళ్లతో పోలిస్తే ఆ ఏడాది నమోదైన కేసులు, క్రైమ్‌ రేటులో భారీగా పెరుగుదల కనిపించింది. దేశంలో పెరుగుతున్న నేరాలపై కేరళ ఎంపీ జోస్‌ కె.మణి బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ సమాధానం ఇచ్చారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. ఏపీలో 2019లో 1,45,751 కేసులు నమోదుకాగా క్రైమ్‌ రేటు 278.6గా ఉందని, 2020లో కేసుల సంఖ్య 2,38,105కి, క్రైమ్‌ రేటు 452.7కి చేరిందని మంత్రి వెల్లడించారు. సంవత్సర కాలంలో లక్ష మంది జనాభాకు నమోదైన నేరాలను క్రైమ్‌ రేటుగా పరిగణిస్తారు.

2020లో ఏపీలో సైబర్‌ నేరాలూ పెరిగాయి. 2019లో 1,886 కేసులు నమోదుకాగా 2020కి ఆ సంఖ్య 1,899కి పెరిగినట్లు మంత్రి తెలిపారు.

ఏపీలో 2020లో రూ.1,44,60,550 విలువైన 17,705 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు, 14 కేసులు నమోదు చేసినట్లు నిత్యానంద రాయ్‌ చెప్పారు.

బాల్య వివాహాల్లోనూ పెరుగుదల : ఏపీలో 2020లో 32 బాల్య వివాహాలు నమోదైనట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 2016లో 19, 2017లో 15, 2018లో 14, 2019లో 4, 2020లో 32 బాల్య వివాహాలు జరిగినట్లు మంత్రి వివరించారు.

...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.