ETV Bharat / city

'ధరణి'పై ప్రభుత్వానికి క్రెడాయ్‌, ట్రెడా సభ్యుల ప్రశంసలు - ధరణిపై క్రెడెయ్‌, ట్రెడా సభ్యుల ప్రశంసలు

ధరణితో రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ అన్నారు. క్రెడాయ్‌, ట్రెడా సభ్యులు, ఉన్నతాధికారులతో సీఎస్​ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని క్రెడాయ్‌, ట్రెడా సభ్యులు అభినందించారు.

Credo and Treda members praised government for Dharani
'ధరణి'పై ప్రభుత్వానికి క్రెడెయ్‌, ట్రెడా సభ్యుల ప్రశంసలు
author img

By

Published : Nov 19, 2020, 10:42 PM IST

రిజిస్ట్రేషన్లలో పారదర్శకతను పెంచడం, వెంటనే మ్యూటేషన్‌ పూర్తిచేసేందుకు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. క్రెడాయ్‌, ట్రెడా సభ్యులు, ఉన్నతాధికారులతో సీఎస్​ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును వివరించారు. రిజిస్ట్రేషన్లు కాగానే పేరు మార్పు కూడా పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగిందని వివరించారు.

ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేయడాన్ని క్రెడాయ్‌, ట్రెడా సభ్యులు అభినందించారు. ధరణి పోర్టల్‌ ద్వారా ప్లాట్లు, స్థలాలు, భవంతులు వంటి రిజిస్ట్రేషన్లు త్వరితగతిన అవుతాయని.. ఆ వెంటనే మ్యూటేషన్‌ పూర్తి కావడం చాలా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.

ఇవీచూడండి: 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.