రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల తక్షణ సహాయం అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర బృందం పర్యటనతో పెద్దగా ఫలితం లేదని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలను కలవకుండా తూతూమంత్రంగా కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి కేంద్ర బృందం పర్యటన కొనసాగలేదని, ఈ ప్రభుత్వంలో కొత్త కొత్త పద్ధతులను పాటిస్తూ బడుగు, బలహీన వర్గాల, ప్రజా సమస్యలు పక్కన పెడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు సార్లు వచ్చిన వరదలతో పెద్ద ఎత్తున పంట నష్టపోయిందని, హైదరాబాద్ అతలాకుతలమైందని జూలకంటి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో... సుమారు రూ.15 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. హైదరాబాద్లో దాదాపు 1700 కాలనీలు నీటిలోనే ఉన్నాయన్నారు. వేల కుటుంబాలు నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. వరదలతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రతి రైతుకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలని డింమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఇకపై విద్యుత్ దాతలుగా రైతులు: మోదీ