కమ్యూనిస్టు ఉద్యమం వందేళ్ల ప్రస్థానంపై హైదరాబాద్ నగర్ సీపీఎం కార్యాలయంలో సభ జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రప్రథమంగా సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పోరాడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్డులోని నగర సీపీఎం కార్యాలయంలో కమ్యూనిస్టు ఉద్యమం వందేళ్ల ప్రస్థానం అంశంపై సభ జరిగింది. 1920 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగిందని.. అప్పటికే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందని.. కాకపోతే ఆ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కోరిందని.. కమ్యూనిస్టు పార్టీ మాత్రం సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడిందని గుర్తు చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ దేశానికి స్వాతంత్య్రం కావాలని నాటి కాంగ్రెస్ సభల్లో ప్రస్తావించిన సందర్భాలను తమ్మినేని గుర్తు చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేయడానికి నిర్మాణాత్మక ప్రణాళికను నాడే తెరపైకి తీసుకువచ్చిందని ఆయన వివరించారు. నాటి పోరాటాల స్ఫూర్తిగా నేడు ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తోందని ఆయన తెలిపారు. అదే పోరాట స్ఫూర్తితో భవిష్యత్తులో పోరాటాలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన