అధిక విద్యుత్ బిల్లులపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని.. వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల రీడింగ్ ఒకేసారి తీయడం వల్ల.. అధిక మొత్తంలో విద్యుత్ బిల్లు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫలితంగా దిగువ, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో ఉన్న కేటగిరీల పద్ధతిలోనే బిల్లు చెల్లించేలా చూడాలని సీఎం కేసీఆర్ను కోరారు.
ఇవీచూడండి: వామ్మో ఇవేం బిల్లులు బాబోయ్..