గచ్చిబౌలిలో కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి తక్షణమే సేవలు ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని... వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. సహాయ చర్యలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే 10కిలోల బియ్యం సరిపోవని... రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని కోరారు.
హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి... రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి... అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రవేటు ఆసుపత్రులను నియంత్రించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలను బతికించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు..