ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్తున్నందున రైతు ఉద్యమ కార్యాచరణ కమిటీని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కోరారు. రాష్ట్ర సీఎంగా దిల్లీకి వెళ్లి ప్రధాని కలవడం మంచిదేనని వ్యాఖ్యానించారు.
"రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ కేసీఆర్ రైతులకి మద్దతిచ్చారు. 8వ తేదీన భాజపాకు వ్యతిరేకంగా తెరాస నినాదాలు చేసింది. మరుసటి రోజే ప్రధానిని అభినందిస్తూ కేసీఆర్ లేఖ రాయడమంటే.. మోదీని ప్రసన్నం చేసుకోవడమే తప్ప మరొకటి కాదు. ఆ లేఖలో ఉన్న ఆంతర్యమేంటో చెప్పాలి."
-నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ఇదీ చూడండి: గవర్నర్ను కలిసిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్.. వార్షిక నివేదిక అందజేత