నీతిఆయోగ్ సమావేశంలో.. 'తయారీరంగ హబ్‌గా భారత్‌ను మార్చేందుకు.. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్రాలు కృషిచేయాలని' ప్రధాని మోదీ పాతపాటే పాడారని.. సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి... పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
88 రోజులుగా జరుగుతోన్న రైతుల ఆందోళనపై నీతి ఆయోగ్ సమావేశంలో ఒక్కమాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించారని, 6 లక్షలకు పైగా గ్రామాలున్న దేశంలో ఈ నిధులు ఎంత వరకు సరిపోతాయని అతుల్‌కుమార్ ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలకు బడ్జెట్లో పన్ను మినహాయింపులు ఇచ్చారని, ఆయా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతా..? అని నిలదీశారు.
ఇవీచూడండి: అంతరిక్షంలోకి పెట్రోల్, డీజిల్ ఫొటోలు పంపండి: నారాయణ