ఏపీ ముఖ్యమంత్రి జగన్ (ap cm jagan ) తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (cpi narayana) విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కోసం ఒకే స్వరం వినిపిద్దామంటూ సీఎంలకు లేఖలు రాసిన జగన్(jagan) .. ప్రధాని (pm modi)ని విమర్శిస్తూ జార్ఖండ్ సీఎం (jharkhand cm) ట్వీట్‌ను ఎందుకు తప్పుపట్టారని ప్రశ్నించారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నందున.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
'కేసుల విషయంలో జరగబోయే పరిణామాల నుంచి బయటపడేందుకే జగన్ వ్యాక్సిన్ల పేరుతో సీఎంలకు లేఖ రాశారు. నిజంగా వ్యాక్సిన్లపై చిత్తశుద్ధి ఉంటే జార్ఖండ్ సీఎంను ఎందుకు తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, జీఎస్టీతో పాటు ప్రజావ్యతిరేక విధానాల అంశాల్లో కేంద్రంపై ఎందుకు పోరాటం చేయటం లేదు...? కేంద్రంపై పోరాడే విషయంలో జగన్‌కు చిత్తశుద్ధి లేదు' - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
తెరాసకే నష్టం...
మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eetela Rajender) వ్యవహారంపై నారాయణ(narayana) స్పందించారు. ఈటల భాజపాలోకి వెళ్తే తెరాస( TRS)కే నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణ మరో పశ్చిమబంగాల్లా మారకుండా కేసీఆర్ (KCR) జాగ్రత్త పడాలని సూచించారు. లక్షదీవుల (lakshadweep)ను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈనెల 8న లక్షద్వీప్ ప్రజల పోరాటానికి సంఘీభావంగా వామపక్షాలు ఆందోళన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: CM KCR: ఈ నెల 7న 19 డయాగ్నొస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం