రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇవ్వడం వల్ల స్వదేశీ విశ్వవిద్యాలయాలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని అవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వ విశ్వవిద్యాయాలు కనుమరుగై... ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను... రాజ్భన్లో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు దత్తాత్రేయతో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దాదాపు 60 శాతం ఖాళీగా ఉన్నాయని... వాటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ