ETV Bharat / city

'చిరంజీవిని అన్నందుకు పశ్చాత్తాప్పడుతున్నా.. ఇక వదిలేయండి..'

CPI Narayana Regret: చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను అన్న మాటలను భాషాదోషంగా పరిగణించాలని చిరంజీవి అభిమానులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.

cpi-leader-narayana-regret-over-comments-on-chiranjeevi

author img

By

Published : Jul 20, 2022, 7:39 PM IST

'చిరంజీవిని అన్నందుకు పశ్చాత్తాప్పడుతున్నా.. ఇక వదిలేయండి..'

CPI Narayana Regret: ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై ఏపీలోని తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి హాజరవ్వటంపై నారాయణ చేసిన వ్యాఖ్యలు పట్ల చిరంజీవి అభిమానులు, జనసైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ అంశంపై తాజాగా నారాయణ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాప పడుతున్నట్లు విజయవాడలో చెప్పారు.

"నా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతలు కొంత మందికి బాధ.. మరికొంత మందికి ఆవేశం కలిగింది. వారి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అవిలేకుండా రాజకీయాలు ఉండవు. ఆ ప్రకారం నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలి. ఆ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలి." - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.