ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో వేలాది మంది ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని చాడ డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద ఏఐటీయూసీ, హైదరాబాద్ నగర సమితి ఆధ్వర్యంలో 200 మంది ఆటో డ్రైవర్లకు, వారి కుటుంబాలకు ఉచితంగా బియ్యం, నిత్యావసరాలను పంపిణి చేశారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చాడ ఆరోపించారు. ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి..సంక్షేమ బోర్డు, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఉంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.ఆటో కార్మికులకు ఆరు నెలల వరకు నెలకు రూ.5 వేల ఆర్ధిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లాక్డౌన్ను పొడిగించారు కాబట్టి.. ఉపాధి లేక అవస్థలు పడుతోన్న పేద కార్మికులకు ప్రభుత్వం ఆర్ధిక భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: లాక్డౌన్ పాస్ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత