ETV Bharat / city

షీ బృందాలకు స్కూటీలు అందించిన సీపీ మహేశ్​ భగవత్​ - she team police news

రాచకొండ కమిషనరేట్​లోని షీ టీవ్​ సిబ్బందికి ద్విచక్రవాహనాలను సీపీ మహేశ్​భగవత్​ అందజేశారు. కమిషనరేట్​ నుంచి మరో అంబులెన్స్​ సర్వీస్​ను కూడా సీపీ ప్రారంభించారు.

cp mahesh bhagwat started scooties to she team police

author img

By

Published : May 20, 2021, 3:13 PM IST

రాచకొండ షీ బృందాల పోలీసులకు ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి. భద్రమైన నగరం అనే ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులతో షీ బృందాల పోలీసులకు ద్విచక్రవాహనాలు ఇచ్చినట్టు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్​ భగవత్‌ తెలిపారు. కమిషనరేట్‌కు మొత్తం 16 వాహనాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

షీ బృందాల సిబ్బందికి ద్విచక్ర వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయని సీపీ వివరించారు. ఘటనా స్థలానికి వేగంగా చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కమిషనరేట్​ తరఫున ఓ అంబులెన్స్‌ను కూడా సీపీ ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. కొవిడ్‌ రహిత రోగులకు అంబులెన్స్‌ సేవలు అవసరమైతే 9490617234 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని కమిషనర్ సూచించారు.

ఇదీ చూడండి: ఎన్టీఆర్, ఇంటర్వెల్​ వరకు​ మాట్లాడని సినిమా అదొక్కటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.