రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా కీసర చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితిలో ఉండగా కాపాడిన గస్తీ పోలీసులను సీపీ మహేశ్‌భగవత్ సన్మానించారు. గ్రామానికి చెందిన నక్క ప్రవీణ్ అనే యువకుడు ఇంట్లో గొడవపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితిలో గుర్తుతెలియని ప్రదేశంలో ఉన్నాడు. కుటుంబసభ్యులు సమాచారంతో గస్తీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను ఉన్నచోటును గుర్తించి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి.. సదరు యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రవీణ్‌ను సమయానికి ఆస్పత్రిలో చేర్చి కాపాడిన గస్తీ పోలీసులను కుటుంబసభ్యులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. కీసర పోలీసుల కృషి మారువలేనిదని... తోటి సిబ్బందికి ఆదర్శమయ్యారని సీపీ మహేశ్ భగవత్ ప్రశంసించారు.
అసలేం జరిగిందంటే...
ప్రవీణ్... పాల వ్యాపారం చేస్తున్నాడు. పాడి గేదెలు కొనడం కోసం తన తల్లిని రూ. లక్షరూపాయలు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడం వల్ల తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని (suicide attempt) తమ్ముడు నవీన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అప్రమత్తమైన నవీన్... అన్నకోసం గాలించగా ఆచూకీ దొరకలేదు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపురం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకుని అపస్మారకస్థితిలో ఉన్న ప్రవీణ్‌ను గస్తీ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: suicide attempt: తల్లితో గొడవపడి ఆత్మహత్యాయత్నం.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ సాయంతో కాపాడిన పోలీసులు..