ETV Bharat / city

అంతర్​రాష్ట్ర పేదలకు నిత్యావసరాలు పంపిణీ - లాక్​డౌన్​

ఇతర రాష్ట్రాలకు చెందిన 250 మందికి సీపీ అంజనీకుమార్​ నిత్యావసరాలను పంపిణీ చేశారు. లంగర్ హౌస్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు సీపీ ధన్యవాదాలు తెలిపారుొ

cp
అంతర్​రాష్ట్ర పేదలకు నిత్యావసరాలు పంపిణి
author img

By

Published : Apr 13, 2020, 4:09 PM IST

హైదరాబాద్​ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్​లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్​హాల్​లో సుమారు 250 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సహకరించి, విజయవంతం చేసిన దాతలందరికీ సీపీ ధన్యవాదాలు తెలిపారు.

రానున్న 20 రోజులు కూడా ప్రజలు లాక్​డౌన్​ను సహకరించాలని సీపీ​ కోరారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో లాక్​డౌన్​ సమర్థవంతంగా అమలవుతోందన్నారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 24 గంటల్లో 35 మరణాలు, 796 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.