ETV Bharat / city

రూ. 1.03 కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం: సీపీ అంజనీకుమార్‌

cp anjanikumar
రూ. 1.03 కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం: సీపీ అంజనీకుమార్‌
author img

By

Published : Jul 3, 2020, 3:58 PM IST

Updated : Jul 3, 2020, 6:47 PM IST

15:55 July 03

రూ. 1.03 కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం: సీపీ అంజనీకుమార్‌

రూ. 1.03 కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం: సీపీ అంజనీకుమార్‌

     విదేశాల నుంచి సిగరెట్లు తీసుకొచ్చి.. హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జంట నగరాల్లో అక్రమంగా విదేశీ సిగరెట్ల రవాణా, విక్రయాలు జరుపుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అనుమతి పత్రాలు, జీఎస్టీ చెల్లింపులు లేకుండా ఈ ముఠా విక్రయాలకు పాల్పడుతోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠా నుంచి సుమారు రూ. కోటి 3 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని అంజనీకుమార్‌ తెలిపారు.

భాగ్యనగరం సురక్షితం..!

          హైదరాబాద్‌ చాలా సురక్షితమైన ప్రాంతమని సీపీ అంజనీకుమార్‌ అన్నారు. కరోనా విషయంలో ఎవరూ  ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. హైదరాబాద్‌లో అధికశాతం కరోనా మరణాలు లేవన్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై కన్నా హైదరాబాద్‌లో కరోనా మరణాలు తక్కువని తెలిపారు. కరోనా నియంత్రణలో పోలీసుశాఖ తమ వంతు సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజా శ్రేయస్సు విషయంలో పోలీస్‌శాఖ ముందుంటుందని సీపీ అంజనీకుమార్‌ అన్నారు.  

ఇవీచూడండి: కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ

Last Updated : Jul 3, 2020, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.