ETV Bharat / city

సమయం ఇవ్వండి: సీపీ అంజనీ కుమార్​ - హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ వార్తలు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్​లో నిందితుడి రంగయ్య లాకప్ డెత్ ఆరోపణలపై నివేదిక సమర్పించేందుకు పది రోజుల సమయం కావాలని విచారణ అధికారి సీపీ అంజనీ కుమార్​ హైకోర్టును కోరారు. లాకప్​డెత్​పై న్యాయవాది నాగమణి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారించింది.

cp anjani kumar sught time for report on manthani lokup death
సమయం ఇవ్వండి: అంజనీ కుమార్​
author img

By

Published : Jun 5, 2020, 11:37 PM IST

కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్​లో నిందితుడు రంగయ్య మృతిచెందాడు. లాక్​ డెత్​ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై న్యాయవాది నాగమణి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ ఘటనపై నివేదిక సమర్పించేందుకు పది రోజులు సమయం కావాలని విచారణాధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హైకోర్టును కోరారు. లాక్​డౌన్ అమలులో నిమగ్నమై ఉన్నందున మంథని వెళ్లి విచారణ జరపలేక పోయినట్లు హైకోర్టుకు నివేదించారు. మరో పది రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'మరో 80 ఏళ్లలో భారత్​కు పెను ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.