ETV Bharat / city

కింగ్​ కోఠి ఆస్పత్రిలో హెల్ప్​డెస్క్ ప్రారంభించిన సీపీ - కింగ్​ కోఠి

హైదరాబాద్​ కింగ్​ కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవిడ్​ హెల్ప్​డెస్క్​ను సీపీ అంజనీకుమార్​ ప్రారంభించారు. ఈ సహాయ కేంద్రం ద్వారా కొవిడ్​కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. నగరంలోని అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఈ హెల్ప్​డెస్క్​లను ఏర్పాటు చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు.

cp anjani kumar started covid help center in king koti hospital

author img

By

Published : May 8, 2021, 10:39 PM IST

ప్రజలందరూ నిబంధనలు పాటిస్తే... కరోనాను అరికట్టవచ్చని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. కరోనా బాధితుల కోసం కింగ్ కోఠిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన... హెల్ప్​డెస్క్​ను అదనపు సీపీ విశ్వప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్​తో కలిసి ప్రారంభించారు. హెల్ప్​డెస్క్​ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అంజనీకుమార్ సూచించారు. నిత్యం రద్దీగా ఉండే కింగ్​కోఠి ఆసుపత్రిలో అడ్మిషన్స్, ఓపీ, వ్యాక్సిన్ వంటి వాటికి ఎటువైపు వెళ్లాలి అనే అంశాలపై అయోమయంగా ఉంటారని... వారి సౌకర్యం కోసం ఈ కేందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

కొవిడ్ బారినపడి ఆస్పత్రిలో చేరిన బాధితులకు సంబంధించిన సమాచారాన్ని, ఇతర కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఈ సహాయ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కొవిడ్​కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని... మాస్కులు ధరించడంతో పాటు శానిటైజ్​ చేసుకోవాలని సూచించారు. నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిని కొనియాడారు. నగరంలోని కొవిడ్ ఆసుపత్రులలో ఈ హెల్ప్​డెస్క్​లను ఏర్పాటు చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.