ETV Bharat / city

వనస్థలిపురం రైతు బజార్​లో వ్యాపారులకు కొవిడ్ టీకా స్లిప్​లు - covid vaccination tokens for super spreaders

ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్ స్ప్రెడర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వనస్థలిపురంలోని రైతు బజార్​లో వ్యాపారులకు టీకా టోకెన్లను అందజేశారు.

covid vaccine for vendors, corona vaccine for super spreaders
వ్యాపారులకు కొవిడ్ టీకా, సూపర్ స్ప్రెడర్లకు కరోనా టీకా
author img

By

Published : May 27, 2021, 12:03 PM IST

రాష్ట్ర సర్కార్ ఆదేశాలకు ముందుగా సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ టీకా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని రైతు బజార్​లో కూరగాయలు అమ్మే వ్యాపారులకు మున్సిపల్ సిబ్బంది కరోనా వ్యాక్సిన్ టోకెన్లు అందజేశారు.

ఇందులో ఏ రోజు వ్యాక్సిన్ వేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అన్న సమాచారం ఉంటుంది. కొవిడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ స్లిప్​లు అందించినట్లు పుర అధికారులు తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.