ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

దాదాపు పది నెలల కాలంగా ప్రజలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి విరుడుగు ఇచ్చే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రభుత్వ ఆస్పత్రులో వాక్సినేషన్ సెంటర్స్​ను ఏర్పాటు చేశారు. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్​కి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్కారు సన్నాహాలు చేసింది.

vaccine
vaccine
author img

By

Published : Jan 15, 2021, 8:45 PM IST

Updated : Jan 15, 2021, 9:12 PM IST

దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వాక్సిన్ అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. అందులో భాగంగా తెలంగాణలో తొలి రోజు మొత్తం 140 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట 139 కేంద్రాల్లో అనుకున్నప్పటికీ అదనంగా నిమ్స్​లోను వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిమ్స్​లో జరిగే వ్యాక్సిన్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొననున్నారు. ఒక్కో కేంద్రంలో 30మందికి చొప్పున టీకా ఇవ్వనున్నారు. ఆయా కేంద్రాలకు ఇప్పటికే తగిన మొత్తంలో వ్యాక్సిన్ డోస్​లను పంపించారు.

అత్యవసర చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు

టీకా తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు ఎదురైతే.... వైద్యం అందించేందుకు తగిన కిట్​లతోపాటు వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. పరిస్థితి విషమిస్తే అత్యవసర చికిత్స అందించేందుకు గాను అదనంగా 57 ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఒక్కో ఆస్పత్రిలో సుమారు పది చొప్పున ఆక్సిజన్ పడకలను సిద్ధం చేశారు. తొలిరోజు వ్యాక్సినేషన్​కు తగిన సిరంజీలతో పాటు.. 55,270 వ్యాక్సిన్ డోస్​లను 33 జిల్లాలకు లబ్ధిదారుల ప్రాతిపాదికన అందజేశారు.

ఇదీ చదవండి : 'వారంలో నాలుగురోజులు వ్యాక్సినేషన్... రేపే ప్రారంభం'

లబ్ధిదారుల ప్రాతిపాదికన టీకా కేంద్రాలు

వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే జిల్లాల్లోనూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, మేజిస్ట్రేట్​లతోపాటు ప్రజాప్రతినిధులు ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. లబ్ధిదారుల ప్రాతిపదికన జిల్లాల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్​లో 14, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్​కర్నూల్ జిల్లాలో రెండేసి కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆదిలాబాద్, భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాలో మూడు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్​నగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ రూరల్​లలో నాలుగేసి చోట్ల వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వర్చువల్​గా మాట్లాడనున్న ప్రధాని

ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్​లలో ఆరు చోట్ల, మేడ్చల్ మల్కాజిగిరి 11, రంగారెడ్డి జిలాలో 9 చోట్ల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొత్తంగా 139 కేంద్రాల్లో మొదటి రోజు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులతో ప్రధాని మోదీ వర్చువల్​గా మాట్లాడనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ జిల్లా నుంచి గాంధీ ఆస్పత్రిని, రంగారెడ్డి జిల్లాలో నార్సింగి రీజనల్ సెంటర్​ను గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

అపోహలు వద్దు: ఈటల

శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేవలం ఒక్కో కేంద్రంలో రోజుకు 30 మందికే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిన సర్కారు... సోమవారం నుంచి ఆ సంఖ్యను 50కి పెంచనుంది. అనంతరం క్రమంగా వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్యతో పాటు... వ్యాక్సినేషన్ కేంద్రాలను 1,213కి పెంచనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల స్పష్టం చేశారు. వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని... సురక్షితమైన వాటినే అందిస్తున్నామని పేర్కొన్నారు. తాను కూడా టీకా తీసుకుంటానని వెల్లడించారు.

ఇదీ చదవండి : రేపు మొదటి డోసు వ్యాక్సినేషన్... నేనూ టీకా తీసుకుంటా: ఈటల

Last Updated : Jan 15, 2021, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.